తమిళనాడులో భారీగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లోని స్కూళ్ళు , కాలేజీలు మూతపడ్డాయి.  గత రెండు సంవత్సరాల క్రితం వర్షబీభత్సం మిగిల్చిన విషాదం ఇంకా మరువక ముందే మరోసారి కుండపోత వర్షాలతో జనాలు అతలాకుతలం అవుతున్నారు.   ఈశాన్య రుతపవనాలకు తోడు అల్పపీడనం ప్రభావంతో రాబోయే 24 గంటల్లో తమిళనాడు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Image result for తమిళనాడు వర్షాలు
ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి బాలచంద్రన్‌ తెలిపారు. తంజావూరు జిల్లాతోపాటు చెన్నై, ఇతర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. తంజావూరు జిల్లా తిన్నయూర్‌లోని వొరతనడుకు సమీపంలో భారీ వర్షం ధాటికి ఓ ఇంటి గోడ కుప్పకూలింది.
Related image
ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.  భారీ వర్షాలతో రోడ్లన్నీ నీటిలో నిండిపోవడంతో సెలవులను ప్రకటించారు . లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ కొరత ఏర్పడింది.   తమిళనాడు అంతటా భారీ వర్షాలు కురుస్తా యని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొ న్నారు. చైన్నైలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ఇళ్ళలోకి వర్షపు నీరు చేరింది. 2015 నాటి వరదల పరిస్థితి పునరావృతం అయ్యే ప్రమాదమున్నందున పౌర సేవలను అప్రమత్తం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

Image result for తమిళనాడు వర్షాలు స్కూల్స్


మరింత సమాచారం తెలుసుకోండి: