ప్రతిపక్ష వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తులపై అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అధికార టీడీపీ అధినేత, ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు శుక్రవారం ఆసక్తికర వ్యాఖ్యలుచేశారు. జగన్‌ అవినీతి ఆస్తుల్ని, సాక్షి పత్రికను కేంద్రం స్వాధీనం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. అవి కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ పరిధిలో ఉన్నాయని, అందుకే మనం ఏం చేయలేకపోతున్నామని అన్నారు. లేకుంటే రాష్ట్రప్రభుత్వ చట్టాలను అనుసరించి ఎప్పుడో స్వాధీనం చేసుకునేవారిమని అన్నారు.

Related image

సత్యం వంటి కార్పోరేట్ స్కాముల్లో చేసినట్టే కేంద్రం ఇక్కడ కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎంత అక్రమంగా సంపాదించినా పట్టుబడితే, చట్టం ప్రకారం ఆ ఆస్తులను జప్తు చేసే అధికారం ఉందని చంద్ర బాబు అన్నారు. ఏసీబీ కేసుల్లో దొరికిన భారీ అవినీతిపరులందరి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని, త్వరలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామన్నారు. అక్రమమార్గాల్లో సంపాదించిన సంపదను డబ్బు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందంటేనే అవినీతి తగ్గుతుందన్నారు. అందుకే నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతిచ్చానన్నారు.
Image result for jagan & cbn
జగన్ పద్ధతిగా ఉండే మనిషి కాదన్టూ "పారడైజ్ పేపర్ల" లో జగన్ పేరు ఉండటం తో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బ తిన్నదని చంద్రబాబు అన్నారు. తాను పాజిటివ్ ఇమేజ్ కోసం చూస్తుంటే, జగన్ చెడగొడుతున్నారని మండిపడ్డారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు నదుల అనుసంధానం చేయాలని ఆయనకు తానే సూచించానని చెప్పారు. 
జగన్‌ అవినీతి చరిత్ర తెలిసినవాళ్లు రాష్ట్రంలో ఇప్పటికీ పెట్టుబడులు పెట్టడానికి జంకుతున్నారని చంద్రబాబు అన్నారు. వచ్చే ఎన్నికల్లో మీరు గెలవకపోతే మా పరిస్థితి ఏమిటి? అని వాళ్లు అడుగుతున్నారని, ఆ పరిస్థితి రాదని మేం ఓడిపోయే సమస్యే లేదని వారికి చెబుతున్నామని అన్నారు. జగన్ లాంటి వారు 2019లో గెలిచి అధికారం లోకి వస్తే ఏమిటనే ఆందోళన పెట్టుబడిదారుల్లో ఉందని, కానీ తాము వైసీపీ అధికారం లోకి రాదని ధీమాగా చెబుతున్నానన్నారు.
Related image
తాము ప్రజల కోసం పనిచేస్తున్నామే తప్ప, ప్రతిపక్షం కోసం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రతిపక్షం లేని శాసనసభ సమావేశాలు ఎలా ఉన్నాయి? అన్న ప్రశ్నకు, "జగన్ ఉంటే గొడవ తప్ప ఏమీ లేదు పాదయాత్ర తో ఎవరూ ముఖ్యమంత్రి కాలేరని చంద్రబాబు అన్నారు. షర్మిల కూడా పాదయాత్ర చేశారు మరి ఆమె సీఎం కాలేదేం? అని ప్రశ్నించారు. 2009కి ముందు నేను కూడా బస్సుయాత్ర చేశా, ఇబ్బందులు పడ్డా కానీ గెలవలేదన్నారు. వైసీపీ సభకు వస్తే సభను ఎలా అడ్డుకోవాలి? ఎవరిని తిట్టాలి? ముఖ్యమంత్రి ని ఎలా అవ మానించాలనే ఉద్దేశ్యంతోనే వచ్చేవారు అన్నారు. జగన్ సభలో ఉంటే అల్లరి, గొడవ, సమావేశాలను అడ్డుకోవడం తప్ప వేరే కార్యక్రమాలు లేవన్నారు.
Related image
ఫిబ్రవరిలో మరోసారి పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. అనంతపురం జిల్లాలో 1500 ఎకరాల్లో దక్షిణ కొరియా టౌన్‌షిప్‌ ఏర్పాటుకి ఆ దేశం ఆసక్తిగా ఉందని తెలిపారు. విశాఖలో లులు గ్రూపు భారీ కన్వెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తోందన్నారు. ఉపాధి హామీ నిధుల్ని బాగా ఖర్చు పెట్టి, పనులు చేసిన రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్‌ ని నమూనాగా చూపించాల్సింది పోయి, నిధులిచ్చేందుకు కేంద్రం కొంత ఇబ్బందులు పెడుతోందని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. 13 వేల కి.మీ. సిమెంటు రోడ్లు వేసిన రాష్ట్రం దేశంలో మరొకటి లేదని, దీర్ఘకాలం ఉండే మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్టూ చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్ల ధనం దేశాన్ని నడపకూడదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: