విశ్వ అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ను మ‌నం ఇప్పటి వరకు నిండైన సూట్‌లోనే చూశాం. ఈ డ్రస్ తతంగమేమిటంటారా, డ్రస్ గురించి మాట్లాడాలంటే మన ప్రధాని నరెంద్ర మోడీని గురించి చెప్పాలి గాని, ట్రంప్ గురించి ఎందుకు మాట్లాడాలి?  అదే కదా అసలు విషయం. సూట్ ఓకే గానీ, ఆయన డైలీ లైఫ్ స్టైల్ ద‌గ్గ‌ర‌గా, చూసినా,  మహా ఐతే ఎప్పుడో ఒక‌సారి ఏదో  ట్రాక్-సూట్‌ లో చూసిన దాఖలాలు ఉంటాయి గానీ, ఇంకే ఇతర సాంప్రదాయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో ఆయ‌న‌న‌ను చూసి ఉండమ‌ని నిస్సందేహంగా చెప్పేయొచ్చు.

donald trump new look dress in manila dinner కోసం చిత్ర ఫలితం


అయినా అకస్మాత్ గా కంపు ట్రంప్‌కు సంబంధించిన ఈ కొత్త ఆరా ఎందుక‌ని అనుకుంటున్నారా?  పిలిప్పీన్స్ రాజ‌ధాని మ‌నీలాలో నిన్న "ఆసియాన్ సద‌స్సు" ప్రారంభ‌ మైనది కదా!  ఈ స‌ద‌స్సుకు భార‌త్‌, జ‌పాన్ త‌దిత‌ర దేశాల‌తో పాటు అమెరికా కూడా స‌భ్య‌దేశంగా హాజ‌రైంది. ఈ సదస్సుకు పిలిప్పీన్స్ రాజ‌ధాని మ‌నీలా ఆతిధ్య దేశం.
donald trump new dress in manila dinner కోసం చిత్ర ఫలితం

అగ్ర‌రాజ్యం అమెరికా నుంచి అధ్య‌క్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్, జ‌పాన్ నుంచి ఆ దేశ ప్ర‌ధానమంత్రి షింజో అబే, భార‌త్ నుంచి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ త‌దిత‌రులు కూడా ఈ సదస్సు కు హాజ‌ర‌య్యారు. ఈ స‌ద‌స్సుకు విచ్చేసిన దేశాధినేత‌ల‌కు మ‌నీలా  "లోక‌ల్ ఫ్లేవ‌ర్‌"  టేస్ట్ చేయిస్తూ పిలిప్పీన్స్ ప్ర‌భుత్వం అక్క‌డి సాంప్ర‌దాయ వ‌స్త్ర‌ధార‌ణ‌తో కూడిన డ్రెస్‌ ల‌ను స్వాగత సత్కారాలతో పాటు అందించింది.
donald trump new dress in manila dinner కోసం చిత్ర ఫలితం

ఈ డ్రెస్‌ల‌తోనే ఆయా దేశాధినేత‌లంతా నిన్న రాత్రి పసందైన విందుకు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా అంతా ఒకే డ్రెస్‌ లో క‌నిపించిన దేశాధినేత‌లు ఆ విందుకు ఒక కొత్త రూపు ను సంతరింప జేశారు. అంద‌రూ ఒకే రంగు, ఒకే త‌ర‌హా దుస్తుల‌తో "యూనిఫైడ్ డ్రెస్ కోడ్" లో క‌నిపించేస‌రికి అక్క‌డ వాతావ‌ర‌ణ‌మే ఆహ్లాద‌క‌రంగా మారింది. 

ఇక ట్రంప్ విష‌యానికి వ‌స్తే, ఇప్ప‌టి దాకా దాదాపుగా ఫుల్-సూట్ తప్ప విభిన్న సాంప్రదాయ వస్త్రధారణ  చేసి ఉండరు. పిలిప్పిన్స్  డ్రెస్‌ లో అగ్రరాజ్య అగ్రజుడు డొనాల్డ్ ట్రంప్‌  "మనీలా లోకల్ డ్రెస్‌" లో నిజం గానే నూత్న కళా  కాంతు లతో మెరిసి పోయార‌ని చెప్పాలి. 

narendra modi new dress in manila dinner కోసం చిత్ర ఫలితం

మ‌నీలా లోక‌ల్-సూట్ ఎలా ఉంద‌న్న విష‌యానికి వ‌స్తే, దాదాపు పొడవు తగ్గించిన మన కుర్తా, పైజామా స్థానంలో ప్యాంటునే వాడుతారు. పొట్టి లేత గోదుమ రంగు ఫుల్ హ్యాండ్స్ కుర్తాలో, న‌లుపు రంగు ప్యాంటును ధ‌రించి దేశాధినేత‌లంతా ట్రంప్ తో సహా విందుకు వ‌చ్చేశారు.  అంతేకాకుండా, అంతా ఒకే ర‌క‌మైన దుస్తుల్లో అక్క‌డికి విచ్చేసిన దేశాధినేత‌లు ఫొటోల‌కు ఫోజు లిచ్చేశారు. విందు ముగిసే దాకా చాలా ఉల్లాసంగా గ‌డిపారు. అంద‌రికంటే కూడా మ‌న ప్రధాని న‌రేంద్ర మోదీ, అంద‌రు దేశాధినేత‌ ల‌తో చాలా ఉల్లాసంగా, ఉత్తేజంగా, ఉత్సాహంగా కలుపుగోలుగా మాట్లాడుతూ తనదైన శైలిలో క‌నిపించారు. మొత్తాని కి కొత్త వ‌స్త్ర‌ధార‌ణ‌లో క‌నిపించిన ట్రంప్‌, ఆ విందుకే హైలెట్ అని చెప్పక త‌ప్ప‌దు. 

కొత్త డ్రెస్‌లో ట్రంప్ లుక్ అదిరిందిగా!

మరింత సమాచారం తెలుసుకోండి: