ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో తెలంగాణా రాష్ట్రానికి రాబోతున్నారు అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాట. త్వరలోనే భారీ బహిరంగ సభ కూడా ఉంటుంది అనేది తెలంగాణా కాంగ్రెస్ వారు చెబుతున్నారు. అయితే ఈ సభ ఒకప్పుడు ప్రత్యేకం కాకపోవచ్చు కానీ రేవెంత్ రెడ్డి లాంటి వ్యక్తి కాంగ్రెస్ లోకి వచ్చిన తరు వాత ఖచ్చితంగా ఈ సభ కీలకం అనే అనాలి.

రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో జేరి వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకూ ఆయనకి ఎలాంటి కీలక పదవీ ఇచ్చింది లేదు. కాంగ్రెస్ లో ఆయన స్థానం ఏంటి అనేది ఇంకా తేలడం లేదు. అయితే ఈ సభ ద్వారా రేవంత్ కి అత్యున్నత పదవి ఇచ్చి అవసరం అయితే సీఎం క్యాండిడేట్ అంటూ డిక్లేర్ కూడా చేసే అవకాశం ఉంది అంటున్నారు. సో ఈ సభ కోసం అందరూ సిద్దం అవుతున్న నేపధ్యం లో ఈ నెల 20 న ఈ సభ జరగాల్సి ఉంది.

హైక‌మాండ్ నుంచి ఈ స‌భ‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింద‌నీ, ఏర్పాట్లు చేసుకుంటున్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే, ఇప్పుడా స‌భ గురించి భిన్న‌వాద‌న‌లు ఆ పార్టీ నేత‌లే వినిపిస్తున్నారు. గ‌డ‌చిన వారం వ‌ర‌కూ స‌భ ఉంటుంద‌నే కిందిస్థాయి కేడ‌ర్ కూడా సంకేతాలు ఇచ్చారు. కానీ, స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న‌కొద్దీ రాహుల్ స‌భ గురించి రాష్ట్ర స్థాయి నేత‌లు ఎవ్వ‌రూ మాట్లాడటం లేద‌ట! కార్యకర్తల్లో నే కాదు నాయకులలో కూడా ఈ విషయం మీద సరైన క్లారిటీ కనపడ్డం లేదు.

అక్టోబర్ చివరి వారం లో రాహుల్ వస్తారు అని కొందరు అంటుంటే అబ్బే కాదు ఇంకా టైం ఉంది అని కొందరు అంటున్నారు. రాహుల్ కి పార్టీ పగ్గాలు అప్పగించీ ప్రోగ్రాం గుజరాత్ ఎలక్షన్ కారణంగా సొనియా వాయిదా వేసారు. సో పార్టీ అధ్యక్షుడి హోదా లోనే రాహుల్ సభ ఏర్పాటు చేస్తారు అనేది అర్ధం అవుతోంది. సో రాహుల్ రాక - రేవంత్ పదవి - గుజరాత్ ఎలక్షన్ తో ముడిపడి ఉన్నాయి అ న్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: