" పప్పు " అంటూ రాహుల్ గాంధీ ని మొదటి నుంచీ హేళన చేస్తూనే ఉన్నారు జనాలు. దాంట్లోంచి బీజేపీ అవకాశం తీసుకుని తమ ప్రకటన లో సైతం రాహుల్ ప్రస్తావన రాగానే పప్పు అంటూ ముద్ర వేసేసింది. ఈ పరిస్థితి లో ఎన్నికల సంఘం బీజేపీ ని ఈ పదం వాడవద్దు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే రాహుల్ గాంధీ తన పాత పప్పు ఇమేజ్ ని తొలగించుకుని కొత్త వైపు వాడిగా అడుగులు వేస్తున్నారు.

సో ఈ ప్రకటన ఆయనకి పాజిటివ్ సందేశమే మరి, అయితే ఆంధ్రప్రదేశ్ విషయం లో కూడా ఈ పప్పు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ బాబు ని చాలా మంది పప్పు అని పిలుస్తూ ఉంటారు. అనేక విషయాల్లో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఇది అటూ అది ఇటూ చేస్తూ మీడియా సాక్షిగా దొరికిపోతూ ఉంటాడు ఈయన.

మంత్రి లోకేశ్ పప్పు అంటూ రోజా వంటి వారు చేసిన వ్యాఖ్యలు చేయడం పరిపాటి. దీనిపై లోకేశ్‌ నిమ్మళంగానే సమాధానం ఇచ్చారు కూడా. అయితే ఇప్పుడు గుజరాత్‌ ఆదేశం వైసీపీ నేతలపై కూడా ఏమైనా ప్రభావం ప్రసరిస్తుందేమో చూడాలి. ఏదేమైనా ఒక విషయం ఎన్నికల కమిషన్ కానీ కాంగ్రెస్ కానీ రాహుల్ గాంధీ గానీ అర్ధం చేసుకోవాల్సింది ఏంటంటే.

ఒక రాజకీయ పార్టీ మరొక రాజకీయ పార్టీ లోని ముఖ్యమైన నాయకుడి కోసం స్పెషల్ గా పెట్టుకున్న పేరులో లేదా గేలి చెయ్యడం కోసం పదాలు వాడితేనో జనం వాటిని తీసుకోరు. ఈ పప్పు అనే కాన్సెప్ట్ జనం లోంచి వచ్చింది. బీజేపీ ని అయితే ఆపుతారు కానీ లోకేష్ , రాహుల్ లాంటి వారిని పప్పూ అనడం జనం లో ఎలా ఆపగలరు?


మరింత సమాచారం తెలుసుకోండి: