తాజాగా గుణశేఖర్ నందీ అవార్డుల కి సంబంధించి స్పెషల్ కామెంట్ లు పెట్టడం అవి సంచలనం అవ్వడం తెలిసిందే. తాజాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది  అవార్డుల విషయంలో అవి సరిగ్గా ఇవ్వలేదు అనీ దక్కాల్సిన వారికి దక్కలేదు అంటూ కామెంట్ చేసారు గుణశేఖర్. గతం లో కూడా వినోదపు పన్ను మినహాయింపు అనేది గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకి ఇచ్చి తన సినిమాకి ఇవ్వకపోవడం మీద ఆయన ఏపీ ప్రభుత్వంతో గొడవ కూడా పడ్డారు, ప్రశ్నించారు.

ఇప్పుడు తాజాగా ఉత్తమ చిత్రం కేటగిరీలో ‘రుద్రమదేవి’కి నంది అవార్డు దక్కక పోవడంపై ఆ సినిమా దర్శకుడు గుణశేఖర్ ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఒక న్యూస్ ఛానల్ కి ఇచ్చిన సెన్సేషనల్ ఇంటర్వ్యూ లో గుణశేఖర్ మాట్లాడారు.

" చంద్రబాబు చాలా మంచి నాయకుడు ఏ ఒక్క వర్గానికో చెందినవారు కానే కాదు. విజన్ కోసం, ఐటీ విజన్ కి ప్రిఫరెన్స్ ఇచ్చి సాగుతున్న వ్యక్తి. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసారు కూడా. చంద్రబాబు ని అభిమానించే వాళ్ళలో నేను కూడా ఒకడిని అయితే ఆయన నా మీద కక్షగట్టారు అని నేను అనుకోవడం లేదు. ఆయనకి అంత ఖాళీ ఎక్కడ ఉంటుంది. నా సినిమాకి అవార్డ్ రాకపోవడం అనేది ఖచ్చితంగా జరిగిన జాప్యమే నేను మంత్రుల దృష్టికి తీసుకుని వెళ్లాను " అన్నారు గుణశేఖర్ .


మరింత సమాచారం తెలుసుకోండి: