రాజ్యాంగ వ్యవస్థ లను గౌరవించక పోవటం నాలుగు స్థంబాల్లో ఒకటైన మీడియా కు అలవాటుగా మారింది. న్యాయ వ్యవస్థ లోపాలను అడ్డు పెట్టుకొని కొందరు స్వార్ధ పరులతో కూడి, సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ  దాదాపు 20 పైగా కేసులలో  విచారణ నిలుపుదల చేయించుకున్న ముఖ్యమంత్రి దేశంలో ఇంకెవరైనా ఉన్నారా? అనుమానా స్పదమే. విచారణ  జరగ కుండా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి "స్టేలు" తెచ్చుకొని బ్రతకటం జగద్విధితం.


abn andhrajyothy కోసం చిత్ర ఫలితం


ఇలాంటి వారిని ఎండగట్టకుండా తనకు నచ్చని వారిని, పత్రికా ముఖంగా  పక్షపాతంతోనో,  ఇంకోరకంగానో ఎండగట్టే తత్వ మున్న ఆంధ్రజ్యొతిని, దాని మానేజింగ్ డైరెక్టర్ ను ఇప్పుడు అందరూ ఎండగట్టవచ్చు. ఎందుకంటే ఒక కేసు విచార‌ణ సంద‌ర్భంగా కోర్టుకు హాజ‌రు కాక‌పోవ‌టం తో న్యాయస్థానం ఆయనపై ఆగ్రహం ప్రదర్శించింది. నీతులు చెప్పే గురివింద కింద నలుపుని యాదృచ్చికంగానైనా దానికే వేలెత్తి చూపింది.  


న్యాయస్థానానికి  ఏం చేస్తే కోపం వ‌స్తుందో, అదే ప‌నిని ప్ర‌ముఖులు చేయ‌టం, ఆకార‌ణంగా మాట ప‌డ‌టం లాంటివి  చేసుంటారు అందుకే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు ప్ర‌ముఖ మీడియా సంస్థ ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌. ఆయన చానలే ధమ్మున్న చానల్ ఆ ధమ్ముతోనే . ఆయన న్యాయస్థానాన్ని నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు.  కాని అక్కడ కూడా ధమ్ముతో దుమ్ము దులపగల వ్యవస్థకు వారిని ఎలా కోర్ట్ కు రప్పించాలో అలా రప్పించగలరు.

సంబంధిత చిత్రం

రాధాకృష్ణ మొన్నటి రోజు నాంప‌ల్లి కోర్టుకు హాజ‌రుకావాల్సి ఉంది. అయితే, ఆయ‌న హాజ‌రు కాలేదు. దీనిపై సీరియ‌స్ అయిన న్యాయ‌స్థానం వ‌చ్చే నెల 5న త‌ప్ప‌ని స‌రిగా కోర్టుకు హాజ‌రు కావాల్సిందేన‌ని ఆగ్రహంగా ఆదేశించారు. ఇదే తప్పిదం కాంగ్రెస్ వారో,  వైసిపి వారో ప్రత్యేకించి జగన్మొహన రెడ్డి చేసుంటే ముఖపత్ర వార్తలు రాస్తారు పదే పదే తమ చానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ వేస్తారు.


ఇంత‌కీ ఈ కేసు ఏమిటన్న విష‌యం పరిశీలిస్తే కొద్దికాలం క్రితం ఆంధ్రప్రదేశ్ కు ప్ర‌త్యేక హోదా, రాష్ట్రం లో క‌ర‌వు తదితర  అంశాల‌పై ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీని ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న రెడ్డి క‌లిశారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని కొన్ని క‌థ‌నాల్ని రసవత్తరంగా పట్టుసడలకుండా వండివార్చుతూ నిరంతరం ఆంధ్ర‌జ్యోతి ప్ర‌చురించింది.


దీంతో జ‌గ‌న్ ప‌రువు ప్ర‌తిష్ట‌ను దెబ్బ తీశారంటూ ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ‌, ప‌బ్లిష‌ర్ వెంక‌ట శేష‌గిరిరావు, ఎడిట‌ర్ శ్రీ‌నివాస్ మ‌రికొంద‌రు ఉద్యోగుల‌పై చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి నాంప‌ల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు.


ఈ కేసు విచార‌ణ మంగళవారం (14 నవంబర్)  కోర్టు ముందుకు వ‌చ్చింది. దీనికి  వేమూరి రాధాకృష్ణ  హాజ‌రుకాలేదు. ఈ నేప‌థ్యంలో కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. విచార‌ణ‌కు వెళితే స‌రిపోయే దానికి లేనిపోని త‌ల‌నొప్పులు తెచ్చుకోవ‌టం ఎందుకో?

జగన్ మోహన్ రెడ్డికి కు ఏదైనా కీడు సంభవిస్తే కొన్ని తెలుగు పత్రికలు ఏమైనా రాయడం అత్యంత ఉత్సుకత చూపిస్తాయి. అలాంటి వాటిల్లో వేమూరి రాధాకృష్ణ గ్రూప్ మరీ ముందుంటుంది. జగన్ మోహన రెడ్డి తన పాదయాత్ర కోసం కోర్డు హాజరుకు మినహాయింపు ఇవ్వమని కోరితే, కోర్డు నిరాకరించింది. కోర్డు నిర్ణయానికి దాని కారణాలు దానికి వుంటాయి. అదంతా ఇక్కడ ఇప్పుడు అప్రస్తుతం.


abn andhrajyothy కోసం చిత్ర ఫలితం

ఆయన్ని న్యాయస్థానం ఏవిదంగా నిలదీసిందీ? ఏ విధంగా అభ్యంతరాలు చెప్పిందీ? ఆఖరికి ఏ విధంగా నిర్ణయం వెలువ డిందీ? ఇందులో జగన్మోహన రెడ్డిని ఎంతగా కిందకు దించాలో అంతగా ఈడ్చేస్తుంది ఏబిఎన్ & ఆంధ్ర జ్యొతి. జగన్ కు మంచివనిపించే అంశాలకు స్పందన ఉండదు. అదే కీడు జరిగే అంశా లను పెద్దగా ప్రచురించారు, చూపిస్తారు.


ఇప్పుడు ఆంధ్రజ్యోతి ప్రచురణ కర్త రాధాకృష్ణకు అదే పరిస్థితి ఎదురయింది. ఒక పరువునష్టం దావాలో ఆయన విచారణకు న్యాయస్థానానికి కొన్ని నాళ్ళుగా సమన్లు అందుకొని కూడా హాజరుకావడం లేదు. జగన్మొహన్ రెడ్డి తన కేసుల్లో ప్రతివారం హాజరవుతూ, పాదయాత్రకు మినహాయింపు అడిగారు.


alla ramakrishna reddy కోసం చిత్ర ఫలితం


కానీ వేమూరి రాధాకృష్ణ అసలు సమాచారం ఇవ్వకుండానో అసంబద్ధ సమాచారైస్తూనో  న్యాయస్థానానికి హాజరు కావడం లేదు. దాంతో నాంపల్లి సిటీ కోర్టు అత్యంత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖచ్చితంగా ఈ సారి హాజరు కావాలని నిర్ధిష్టంగా ఆదేశించింది.


సరే ఇంతకీ వేమూరి రాధాకృష్ణ హాజరు కాకపోవడానికి ఆయన న్యాయవాది చెప్పిన కారణం ఏమంటే "శాసనసభ శీతాకాల సమావేశాల కవరెజి చేసే పనిలో తీరిక లేక పోవటంలో రాలేకపోయారుట. ఈయన ఒక ప్రచురణ కర్త. అది ఆయన దిన చర్య. అది విధానసభ సమావేశాలైనా ఇంకా ఏదైనా కార్యమాలు రోజూ ఉండటం సహజం. ఆయన శాసన సభకు హాజరు అవరుకదా! అక్కడి వార్తలు రిపోర్ట్ చేసే సాధారణ రిపోర్టర్ కూడా కాదు కదా! ఆ పని చేయటానికి రిపోర్టర్లు వుంటారు కదా! విధాన సభకు చెందిన వార్తలను ఈయన ఎడిట్ చేస్తారా! ఈయనే చేస్తే సబ్ ఎడిటర్లు దేనికి! అవన్నీ చూసుకోవటానికి చక్కగా జీతం తీసు కొని పనిచేసే సంపాదకులు వుంటారు కదా! రాధాకృష్ణ పబ్లిషర్ గా ఆయన కార్యక్రమాలు లిమిటెడ్ మాత్రమే. ఆయనను జర్నలిస్ట్ గా అని మాత్రం అనుకోవడానికి ఆస్కారం ఉండదు.


alla ramakrishna reddy కోసం చిత్ర ఫలితం


ఇంత మంచి చానల్ ను ఒక రాజకీయ నాయకుని పాదాల చెంతో ఒక కుల వర్గ దాపునో పెట్టి పాదపూజ చేస్తే సాధరణ జనం హర్షించరు. తెలుగుదేశం నాయకత్వం చేస్తున్న తప్పులను కప్పిపుచ్చే ఈ మీడియా ను తెలుగుదేశం కరపత్రం అనకుండా ఎలా ఉంటారు. ఏబిఎన్ సంస్థ టిడిపి బాజాగా మారటం మీడియాధర్మాన్ని తాకట్టు పెట్టడమే నని ప్రజలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: