ఈ మద్య అంధ్రప్రదేశ్ లో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీలో జరిగిన ఘోర బోటు ప్రమాదం మరువకముందే మరో ప్రమాదం చోటు చేసుకుంది.  ఓ వైపు ఏపీ టూరిజంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పింది.  కృష్ణా నదిలో శుక్రవారం మరో పడవ బోల్తా కొట్టింది.

ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక వద్ద జరిగింది.  కాకపోతే ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టని కార్మికులు వెంటనే బోటు దునికి తమ ప్రాణాలు రక్షించుకున్నారు.  దీంతో అందులో ప్రయాణిస్తున్న వారు క్షేమంగా బయట పడ్డారు. 

బోటు మునగడానికి కారణం నదిలో నుంచి ఇసుక తీసుకొస్తుండగా పడవ మునిగి పోయింది.  పరిమితికి మించి ఇసుకను లోడ్‌ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి అతి సమీపంలో ఈ బోటు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. కృష్ణా నది పవిత్ర సంగమం చేరువలో పడవ బోల్తా పడిన ఘటనలో 21 మంది దుర్మరుణం చెందిన విషయం తెలిసిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: