ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఏపీ అభివృద్ది కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకు వస్తున్నారు. ముఖ్యంగా రాజధాని అభివృద్ది కోసం విదేశీ నిధులు రాబట్టేందుకు కృషి చేస్తున్నారు.  తాజాగా ఎపిలోని విశాఖపట్నంలో జరుగుతున్న అగ్రిటెక్ సదస్సుకు హాజరైన ప్రపంచ కుబేరుడు బిల్‌గేట్స్ మాట్లాడారు. వాళ చారిత్రాత్మక రోజు అని అన్నారు.

ఏపి అగ్రిటెక్ సదస్సుకు హాజరుకావడం సంతోషంగా ఉంది.  అంతే కాదు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు మంచి మిత్రులు అని..టెక్నాలజీ గురించి ఆయనకు ఎంతో బాగా తెలుసని అన్నారు.  వ్యవసాయంలో మరింత సాంకేతికతను వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చినప్పుడు అభివృద్ధి సాధ్యమవుతుందని బిల్‌గేట్స్ పేర్కొన్నారు. ఇండియాలో చిన్న, సన్నకారు రైతులే అధికమని, భారత ఆర్థిక వృద్ధి వ్యవసాయంపై ఆధారపడి ఉందన్నారు. మెగా సీడ్‌పార్క్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, విత్తన ఉత్పత్తిలో ఎపి హబ్‌గా మారిందని చెప్పుకొచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: