హింస భీభత్సం భయానకం రక్తం ...చూసే ప్రేక్షకులకు భయ భీకర రోమాంచితం "లెజండ్" సినిమాలో ప్రధాన నేపధ్యం. ఏవరైనా ఇదే చెపుతారు. అసలు ఈ సినిమాకు తన వాళ్లు కాబట్టి ఒక ఉత్తమ నటుడు అవార్డ్ ఇస్తే సరిపోయే దానికి తొమ్మిది బంగారు నందులు అవార్డులుగా ఇచ్చి ఒక జాతి పరువు ప్రతిష్ఠ ఒక కులం కోసం గంగ లో కలిపారని.... గంపగుత్తగా అవార్డులు ఇవ్వటం ధారుణ విమర్శలకు దారితీసింది. ఇది సాధారణ ప్రజల మాట.
సంబంధిత చిత్రం

ఒక సినీనటిగా శాసనసభ్యురాలిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డ్స్‌ పై  ఫైర్ బ్రాండ్ "రోజా"ఫైర్అయ్యారు. అవి నందిఅవార్డులు కాదు.. నారా... అవార్డులు అంటూ పంచ్‌ లు విసిరారు. బాలయ్య నటించిన "లెజెండ్"చిత్రా నికి 9 నందు లు ప్రకటించడంపై స్పందిస్తూ, రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి ఉపయోగపడే విధంగా అవార్డ్స్‌ను ప్రకటిచారనే విషయం చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడన్నారు.

most beautiful politician & cine star roja కోసం చిత్ర ఫలితం

ముఖ్యంగా 2014, 2015, 2016 మూడు సంవత్సరాలకు ఒకేసారి అవార్డ్స్‌ ప్రకటించడాన్ని తప్పుపట్టారు. ఈ అవార్డ్స్ కేవలం తనవారి కోసమే అన్నట్లు ఉన్నాయని, అయినా నిజం చెప్పి  కులం, జాతి అంటే తెగ ఫీల్ అవుతారని, ఈ మూడేళ్లలో ఎన్ని మంచి సినిమాలు వచ్చాయి, ఎంత మంది మంచి నటులు ఉన్నారు? వాళ్లందర్నీ కాదని తమ వాళ్ల వారికి మాత్రమే అవార్డులను ప్రకటించుకుని "బంగారు నంది అవార్డ్స్‌" కు ఉన్న విలువను దిగజార్చారంటూ తీవ్రస్థాయిలో మండి పడ్డారు ఎమ్మెల్యే రోజా. గతంలో నంది అవార్డ్స్‌ అంటే ఒక గౌరవప్రదమైన గుర్తింపు ఉందని వీళ్లు చేసిన పనికి వాటి స్థాయి పడిపోయిందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: