హృదయంలో మార్ధవత్వం సున్నితత్వం ఉన్న రాధాకృష్ణ మాత్రం తన కొత్త పలుకు ద్వారా అనేక పాత విషయాలు కొత్తగా చెప్పారు. తానే ప్రభుత్వం లాగా లేకపోతే ప్రభుత్వంలో పరకాయ ప్రవేశం చేసి జనోపదేశం చేశారు. రాధాకృష్ణ పలుకుల్ని గుఱించి మనం కొంచం ముచ్చటించుకుందాం.   

kotha paluku abn andhra jyoti కోసం చిత్ర ఫలితం


ముత్తవరపు వెంకయ్యనాయుడిని ఉపరాష్ట్రపతిగా నియమించటంతో ఆంధ్రప్రదేశ్ జనావళికి హస్తినాపురంలో అండదండలు ఉడిగిపోయాయట. వెంకయ్యనాయుడు గారు కేంద్రమంత్రిగా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన మేళ్ళేమిటట, ఉద్ధరించిన సందర్భాలేమిటని, జనం ప్రశ్నిస్తున్నారు. విభజన సమయం లో పార్లమెంట్ ప్రసాదించిన వరాలు:


*"ప్రత్యేక హోదా" ను ఇచ్చారా? దేవుడు వరమిచ్చినా ఈ పూజారులే అడ్డుపడుతున్నారు.
*కొత్త రైల్వే జోన్ తెచ్చారా?
*పన్ను రాయితీలు సాధించుకొచ్చారా?
*వెంకయ్య కనుక లోక్-సభలో విభజన బిల్లు పాస్ అవకముందే ప్రత్యేక హోదా అంశాన్ని బిల్లులో పెట్టమని పట్టుబట్టి ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని ప్రజలు భావిస్తూ ఉన్నారు.

kotha paluku abn andhra jyoti  కోసం చిత్ర ఫలితం


ఏవో రెండు లక్షల ఇళ్లు ఇవ్వగానే రాష్ట్రాన్ని ఉద్ధరించినట్లా?  నాయుడు గారి కులజనుల స్వంత పార్టీ టిడిపి కోసం తన సొంత పార్టీ బాజపాని రాష్ట్రంలో ఎదగకుండా చేసారనే కారణంతోనే వెంకయ్య నాయుడు గారిని ఉపరాష్ట్రపతిగా పట్టంగట్టి రాజకీయాల నుండి పక్కన బెట్టిన విషయం రాధాకృష్ణ గారికి తెలిసిన విషయమే కాదా!  అంటున్నారు విఙ్జులు. ఇది వెంకయ్య నాయుడు గురించిన పాత పలుకే గాని కొత్తపలుకులో చెప్పారు.
narendra modi warned jayalalita about sasikala కోసం చిత్ర ఫలితం

"నరెంద్ర మోది శశికళ తో పొత్తుకుకి ప్రయత్నం చేశారు" అనేది జనం చెవులో "సన్-ఫ్లవర్" పెట్టారని జనం గుర్తించారు. శశి కళ కి తొలి నుండీ మోడీకి తన మీద ఉన్న తీవ్రమైన కేసుల చరిత్ర & తీవ్రత తెలుసని బాగా తెలుసు. కాబట్టి నరెంద్ర మోదితో స్నేహం చేయాలని ప్రయత్నించింది. అసలు మోడీ ఆమెకు స్నేహహస్తం అందిస్తే ఆమె ఖచ్చితంగా ఆ చేతిని అందుకు నేదే. శశికళ మీద మొదటి నుంచి, అంటే తాను ప్రధాని కాకముందు నుంచే నరెంద్ర మోదికి సదభిప్రాయం లేదు.


ఈ విషయాన్ని ఒక సందర్భంలో శశికళతో జాగ్రత్తగా ఉండమని, జయలలితకు చెప్పారని జయలలిత మరణ సమయంలో మీడియా కోడై కూసింది. ఈ విషయాన్ని రాధాకృష్ణ కూడా నాడు తన కొత్త పలుకు చిలకలా పలికారని జనానికి ఫుల్లుగా తెలుసని ఆయనకు తెలిసినా టిడిపి మీద వాత్సల్యం తో బాజపా మీద ఒక రాయేసేందుకు అబద్ధం చెప్పారు. శశికళ కబంధ హస్తాల నుండి నుంచి అన్నా-డిఎంకెను బయటకి తెచ్చి, ఆ పార్టీని తమ బాజపాకి అనుకూలంగా మరీ పచ్చిగా చెప్పాలంటే తోక పార్టీ గా మార్చుకోవాలని నమో నాయకత్వంలోని బిజెపి ప్రయత్నం చేసిందనేది జగమెరిగిన నిజం.

narendra modi never cared sasikala కోసం చిత్ర ఫలితం

ఇక ప్రతిపక్ష వైసిపి అధినేత జగన్మోహన రెడ్డి 'సంకల్ప యాత్ర' గురించి కొత్త పలుకులో ఎప్పటిలాగే నీతి శతకం బోదించారు. మరి విధానసభ సభాధిపతి "రాజ్యాంగ స్ఫూర్తి" కి తిలోదకాలిచ్చి ఫిరాయింపు ఎమెల్యేలపై అనర్హత వేటు పడకుండా కాపాడు తున్నా ఆయనపై కొత్త పలుకులో రాధాకృష్ణ చిలక ఏమాత్రం పలుకూ పలకలేదు  పలకలేదు. ఇలాంటి శాసనసభ స్పీకర్ ఆ అధికార పీఠం మీద ప్రతిష్టితుడై ఉండగా ప్రతిపక్షానికికే కాదు, రాజ్యాంగానికి కూడా జరిగేది  అన్యాయం  అని తెలిసినా రాధాకృష్ణ జగన్మొహన రెడ్డి సంకల్ప యాత్రపై నీతులెలా చెబుతున్నారో! 


ఏనాడో  జనం అర్ధం చేసుకున్న "ఏబిఎన్-ఆంధ్రజ్యోతి మీడియా" నైజాన్ని గురించి తనే గుర్తించలేకపోవటం...."బులెట్ దిగి చాలాసేపైంది...నీకే కొవ్వు పట్టి ఉండటంతో తెలియట్లా" అనే సినిమా డైలాగ్  లాగా అర్ధం కాలేదు మీకు. 


జగనేమో నేడు సంకల్పయాత్ర ముఖ్యమంత్రి పదవికోసం చేస్తున్నారట, ముఖ్యమంత్రి చంద్రబాబేమో నాడు తెలుగుదేశం పార్టీని బ్రతికించుకోవడం కోసం చేసారని తన చిలకను తెలివిగా పలికించారు కొత్తగా. అందుకని ఆనాడు చంద్రబాబు చేసింది న్యాయమట ఈనాడు జగన్ చేస్తున్నది అన్యాయమట. బాబు పాదయాత్రలో త్యాగం జగన్ పాదయాత్రలో స్వార్ధం ఉన్నట్లు ఉద్భోదించారు రాధాకృష్ణ మాస్టారు అంటే చంద్రబాబు నాయుడు నారాయణనో, యనమల రామకృష్ణుడి నో ముఖ్యమంత్రిని చేద్దామని పాదయాత్ర చేసారా?  అని జనం అంటున్నారు. చంద్రబాబు పాదయాత్ర చేసింది తన ముఖ్యమంత్రి పదవికోసం కాదని జనం కూడా అంటున్నారని కొత్తపలుకులోకి చిలక పరకాయ ప్రవేశం చేసి చెప్పినట్లు కాదా!
transtroy కోసం చిత్ర ఫలితం
అలనాడే "ట్రాన్స్-ట్రాయ్ సంస్థ" అంతర్జాతీయ లీలలు తెలుగు వారికే కాదు భారత జాతికి బట్టలిప్పి నేషనల్ మీడియా చెప్పి నా - కొత్తపలుకులో రాధా కృష్ణ చెప్పక పోయినా - పోలవరం ప్రోజెక్ట్ లాంటి జాతీయ ప్రోజెక్ట్ ను నిర్మించే సామర్ధ్యం  ట్రాన్స్-ట్రాయ్ సంస్థకి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఈ మద్యనే తెలిసినట్లుగా కొత్తపలుకు రాధాకృష్ణ తన చిలక స్వరంలో పలికించి జనం చెవిలో ఒక "కాలీ-ఫ్లవర్" పువ్వు పెట్టెశారని అనుకుంటున్నారు. ఈ తెలుగుదేశం కరపత్రం చదివేవారు, చానల్ చూసేవారు వాటిపై సెటైర్లు వేసుకుంటూ ఆత్మానందం పొందుతున్నారని ఈ యనకు తెలియదేమో పాపం! అందుకే జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. 
babu padayatra jagan sankalpa yatra కోసం చిత్ర ఫలితం
ట్రాన్స్-ట్రాయ్ పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో ఎన్ టివి లాంటి  ప్రముఖ చానళ్ళు అనేక సార్లు తమ కథనాలతో హోరె త్తించి నా జననికి తెలియదనేగా రాధాకృష్ణగారి నమ్మకం. అయినా ట్రాన్స్-ట్రాయ్ సంస్థ నుంచి వచ్చే కమీషన్లు, దాని అధి నేత రాయపాటి కులం కారణంగా ఆ కంపెనీని చంద్రబాబు ఇంత కాలం కొనసాగిస్తూ వచ్చారు.


శశికళ చరిత్ర ముందే తెలుసుకుని ఆమెను తొక్కేసినట్లుగానే  ట్రాన్స్-ట్రాయ్ సంస్థ లీలలు మొత్తం తెలిసిన మోడీ-షాలు అధికారికంగా కేంద్రం సహకారం ఆపేయించారని జనానికి కూడా తెలుసట. కుల ప్రేమ, బంధు ప్రేమ అనే అంధకారం రాధాకృష్ణ మస్థిష్కాన్ని కమ్మేసింది.


ఇది చాలావరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారి స్వయంకృతాపరాధమే.   కొత్త పలుకులో కొత్తదేమీ లేకపోయినా  నాలుగు మాటలు, ఆరు నీతులు చెప్పి ఈ వారం దాన్ని "చెత్త బుట్ట"  చేశారని అంటున్నారు కాస్త ఙ్జానమున్న జనం. 
kotha paluku abn andhra jyoti  కోసం చిత్ర ఫలితం   

మరింత సమాచారం తెలుసుకోండి: