తెలుగుదేశం పార్టీకి చెందిన సొంత నాయకులే   ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడుతున్నారు. అసెంబ్లీ వేదికగా టిడిపి ఎమ్మెల్సీ మూర్తి సొంత ప్రభుత్వంపై మంత్రులపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా  రాష్ట్రంలో ఉన్న పేదలకు ఉపయోగపడే పథకాలపై ప్రభుత్వ అలసత్వాన్ని తీవ్రంగా విమర్శించారు ఆయన. ఎన్నికలప్పుడు రాష్ట్రంలో ‘అన్న’ క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని, చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

ఎమ్మెల్సీ మూర్తి శాసనమండలిలో మాట్లాడుతూ 6 నెలల క్రితం మంత్రి సునీత అన్నా క్యాంటీన్ మీద ఏం సమాధానం చెప్పారో ఇప్పుడున్న మంత్రి పుల్లరావు కూడా  అదే జవాబు చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. ఆ శాఖకు సంబంధించి మంత్రులు మారినా పథకాలు మాత్రం అమలు కావడం లేదని అన్నారు. అన్నా క్యాంటీన్ లో విషయంలో తక్షణమే స్పందించాలని కోరారు.

వైద్య ఆరోగ్యశాఖ తీరు కూడా సరిగాలేదని రాష్ట్రంలో డెంగీ-మలేరియా వ్యాధులు కూడా భయంకరంగా నమోదవుతున్నాయని ప్రజలను కాపాడాలని ఆయన కోరుకున్నారు. నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ పథకం అమలు చేయడంలో విఫలమైందని విమర్శలు వినబడుతున్నాయి. పక్క రాష్ట్రం  తమిళనాడులో 5 రూపాయలకె భోజనం పెట్టి సక్సెస్ కావడంతో, చంద్రబాబు నాయుడు కూడా అదే తరహాలో అన్నా క్యాంటీన్లు  ఏర్పాటు చేద్దామనుకున్నారు. ఈ పథకం అమలు చేయడానికి  రాష్ట్ర మంత్రులు అధికారులు కూడా  తమిళనాడు రాష్ట్రంలో  ‘అమ్మ క్యాంటీన్’ లను  కూడా సందర్శించారు.

అయినా కూడా ఈ  పథకం రాష్ట్రం లో  అమలు కాకపోవడం దారుణం. ఇటువంటి పథకాలు తెలుసుకొని, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వారి  రాష్ట్రాలలో ఇలాంటి క్యాంటీన్లను నిర్వహించాయి. ఆయా రాష్ట్రాలలో మంచి పేరు కూడా వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్లో మాత్రం ఈ పథకానికి దిక్కు దివాణం లేకుండా పోయింది అని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్సీ మూర్తి  రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శల వర్షం కురిపించారు. ఈయనే కాదు అన్నా కాంటీన్ లు వస్తాయి అని ఎదురు చూసినవారు అందరూ ఇదే మాట అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: