గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ ల మద్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది.  అధికార పార్టీ అభివృద్ది పనులు చేస్తున్నామంటే..ప్రతిపక్ష పార్టీ అవన్నీ భూటకాలే అని ప్రచారం చేస్తున్నాయి.  ప్రజల్లో వైసీపీ పార్టీ ప్రభావం తగ్గిపోతుందని ఆ పార్టీ అధినేత  వైఎస్ జగన్ ఈ నెల 6 నుంచి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే పలు గ్రామాల్లోని ప్రజలను కలిసిన జగన్ వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకుంటున్నారు.  తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నేతలు రోజా, కాటసాని రాంరెడ్డిలపై బనగానపల్లె పోలీసులు కేసులు నమోదు చేశారు. 

కర్నూలు జిల్లా హుసేనాపురంలో అనుమతి లేకుండా సమావేశం నిర్వహించారని ఆరోపిస్తూ ఐపీసీ సెక్షన్ 188, 30 పోలీస్ యాక్ట్  కింద కేసులు పెట్టారు. అయితే సోమవారం హుసేనాపురంలో నిర్వహించిన మహిళా సదస్సులో జగన్, రోజా, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి పాల్గొన్నారు. 

వాస్తవానికి అక్కడ మహిళా సదస్సు నిర్వహించేందుకు అనుమతి లేదని చెబుతూ పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు.  మరోవైపు తాము ఈ నెల 15నే అక్కడ అనుమతి తీసుకున్నామని ..16న దానిని రద్దు చేస్తూ నోటీసులు  పంపారని వైసీపీ నేతలు చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: