ఈ భూమిపై  గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా? భూమి మీద కాకుండా వేరే గ్రహంపై కూడా జీవం ఉనికి ఉందా? అన్నది కచ్చితంగా నిర్ధారణ కాకపోయినా.. ఎలియన్స్‌ విషయంలో ఎన్నో ఊహాగానాలు, అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ మద్య విశాఖలో మూడు పక్షులు కనిపించాయని, అవి గ్రహాంతరవాసుల్లా ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో ఆ పక్షులకు సంబంధించిన వీడియో తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.  వైజాగ్ వన్ టౌన్ లో పాత పోస్టాఫీసుకు దగ్గర్లో పోలీస్ స్టేషన్ ఉంది. దాని పక్కనే ఒడిశా స్టీవ్ డోర్స్ లిమిటెడ్ అనే షిప్పింగ్ కంపెనీ ఉంది. 
Image result for fruits
అక్కడ బాత్రూమ్ పైనున్న రూఫ్ మీద, శ్లాబు కింద చిత్రమైన పక్షులు కనిపించాయి. మొదట వాటిని గుడ్లగూబలుగా భావించారు. అయితే, వాటికంటే పెద్దగా ఉండడంతో పాటు, కాళ్లతో శబ్దం చేయడాన్ని గమనించి, ఇవేవో వింతగా ఉన్నాయే అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి ఏలియన్ పక్షులంటూ ప్రచారం జరిగింది. 

ఈ విషయం కాస్త ఆ నోటా ఈ నోటా విని ఆ సంస్థ జనరల్ మేనేజర్ జేకే నాయక్ చెవిన పడింది.  దీంతో ఆయన వాటికి పళ్లు, కాయగూరలు తెచ్చిపెట్టడం ప్రారంభించారు.  విచిత్రమేమంటే..ఆ పండ్లూ, కాయలు అవి అస్సలు ముట్టుకోవడం లేదట..సాధారణంగా పక్షలు పండ్లూ, ఫలాలు ఇష్టంగా తింటాయి.

కానీ ఈ పక్షులు మాత్రం వాటి జోలికి పోవడం లేదు..పైగా  బాత్రూమ్ కి ఉన్న రంధ్రంలోంచి ఆ పక్షుల తల్లి బయటకు వెళ్లి ఏదో ఆహారం తెస్తోందని, దానిని మాత్రమే అవి తింటున్నాయని ఆయన తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: