అంతర్జాతీయంగా భారత్ పట్ల వెల్లడౌతున్న సుహృద్భావం భారతీయులంతా గర్వించే విధంగా మరోసారి మరో సంఘటన ఐక్యరాజ్య సమితిలో జరిగింది. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) న్యాయమూర్తిగా రాజస్థాన్ లోని జోద్ పూరులో జన్మించిన  పద్మభూషన్ గ్రహీత  భారతదేశ అభ్యర్థి "జస్టిస్ దల్వీర్ భండారీ" రెండవసారి కూడా ఎన్నికయ్యారు. 

సంబంధిత చిత్రం

అంతర్జాతీయ న్యాయస్థానం కేంద్ర కార్యాలయం నెదర్లాండ్స్‌ లోని హేగ్‌ నగరంలో ఉంది. ఈ అత్యున్నత న్యాయస్థానంలో 15 మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఉంటుంది. వీరి పదవీ కాలం 9 ఏళ్లు. మూడేళ్లకు ఒకసారి వీరిలో ప్రతి అయిదుగురి స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తుంటారు. ఐక్యరాజ్య సమితిలోని జనరల్‌ అసెంబ్లీలో సభ్యులైన 193 మంది, భద్రతామండలిలోని 15 మంది ఐసీజే న్యాయమూర్తులను ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల్లో గెలవాలంటే జనరల్‌ అసెంబ్లీలో కనీసం 97 ఓట్లు, భద్రతామండలిలో 8 ఓట్ల మెజార్టీ రావాలి. రెండింటిలో మెజార్టీ సాధించిన వారే ఎంపికవుతారు.

international court of justice with dalveer bhandari కోసం చిత్ర ఫలితం

బ్రిటన్ అభ్యర్థి "క్రిస్టఫర్ గ్రీన్‌వుడ్‌" పోటీ నుంచి చివరి అంకంలో ఉపసంహరించుకున్నారు. దీంతో 2018-2027 పదవీ కాలానికి న్యాయమూర్తి జస్టిస్ భండారీ ఎన్నికయ్యారు. బ్రిటన్ అభ్యర్థి గ్రీన్‌వుడ్‌కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని శాశ్వత సభ్య దేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా మద్దతు పలికినట్లు కనిపించాయి. బ్రిటన్ కూడా శాశ్వతసభ్య దేశమే.
 

అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిని ఎన్నుకునేందుకు ఐక్యరాజ్య సమితి సర్వ సాధారణ సభ, భద్రతా మండలిలో ఏక కాలంలో, వేర్వేరుగా ఎన్నికలు జరుగుతాయి. 12వ రౌండ్ ఓటింగ్ జరగడానికి కాస్త ముందుగా, ఐక్యరాజ్య సమితికి బ్రిటిష్ శాశ్వత ప్రతినిథి మాథ్యూ రైక్రోఫ్ట్ సాధారణ సభ, భద్రతా మండలిలకు లేఖలు రాశారు. 15 మంది న్యాయమూర్తులు ఉండే అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తి పదవికి జరుగుతున్న ఎన్నికల నుంచి తమ అభ్యర్థి జస్టిస్ క్రిస్టఫర్ గ్రీన్‌వుడ్ ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నారని తెలిపారు.

సంబంధిత చిత్రం

11 రౌండ్ల ఓటింగ్‌లో జస్టిస్ భండారీకి సాధారణ సభలో మూడింట రెండొంతుల ఓట్లు దాదాపుగా లభించాయి. అయితే భద్రతా మండలిలో 5 ఓట్లే దక్కాయి. 11 రౌండ్లు పూర్తయినా ఫలితం తేలకపోవడంతో నిన్న సోమవారం (నవంబర్ 20) మరో రౌండ్‌ నిర్వహించాలని భావించారు. అయితే ఎన్నికలకు కొద్ది గంటల ముందు అనూహ్యంగా బ్రిటన్‌ పోటీ నుంచి తప్పుకోవడం తో, దల్వీర్ భండారి ఎన్నికకు మార్ర్గం సుగమమైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన భండారి 2012 ఏప్రిల్‌ 27న ఐసీజే కు ఎన్నికయ్యారు. రెండో పర్యాయం ఐసీజేకు ఎన్నికైన భండారి 2027 వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.


దల్వీర్  ప్రత్యర్థి గ్రీన్‌వుడ్‌కు 9 ఓట్లు లభించాయి. దీంతో ఎన్నికలో ప్రతిష్టంభన ఏర్పడింది. జస్టిస్ గ్రీన్‌వుడ్ ఉపసంహరించు కుంటున్నట్లు బ్రిటన్ ప్రకటించడంతో ఎన్నికల బరిలో కేవలం జస్టిస్ భండారీ మాత్రమే మిగిలారు. అయితే లాంఛనాన్ని పూర్తి చేయడానికి సాధారణ సభ, భద్రతా మండలి ఓటింగ్ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. సాధారణ సభలో భారతదేశానికి అద్భు తమైన సానుకూలత కనిపించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పట్ల ఉన్న వాతావరణానికి ఇది నిదర్శనం.  సరిగ్గా ఇదే కారణం ప్రపంచ అగ్ర దేశాలకు సంతోషాన్ని ఇవ్వలేకపోతోంది. జస్టిస్ భండారీకి సాధారణ సభలో 183/193 ఓట్లు, భద్రతా మండలిలో 15  ఓట్లు లభించాయి.

international court of justice with dalveer bhandari కోసం చిత్ర ఫలితం

మొదటి నుంచీ సాధారణ సభలో ఇండియాకు బంపర్ మెజార్టీ ఉండగా.. భద్రతా మండలిలోని 15 సభ్యదేశాల్లో 9 యూకేకు మద్దతు తెలిపాయి. 11 రౌండ్లలోనూ ఎవరికీ పూర్తి మెజార్టీ రాకపోవడంతో సెక్యూరిటీ కౌన్సిల్ సాయంతో అసలు ఓటింగ్ ప్రక్రియనే ఆపేయాలని యూకే చూసింది. అయితే దానికి భద్రతా మండలిలో యూకేకు మద్దతుగా ఉన్న 9 దేశాలు అంగీక రించలేదు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో యూకే తప్పుకుంది. 70 ఏళ్ల ఐక్య రాజ్య సమితి చరిత్రలో తొలిసారి యునైటెడ్ కింగ్ డమ్ కు ఐసీజేలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది.


అంతేకాదు యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో శాశ్వత సభ్యత్వం ఉన్న దేశం సాధారణ దేశం చేతిలో ఓడిపోవడం ఇదే తొలిసారి. ఒక ఐసీజేలో సిట్టింగ్ సభ్యుడు మరో సిట్టింగ్ సభ్యుడి చేతిలో ఓడిపోవడం కూడా తొలిసారి కావడం గమనార్హం. దీంతో ఏ రకం గా చూసినా.. ఇండియా సాధించిన ఈ విజయం ఎంతో ప్రత్యేకమైనదని చెప్పుకోవాలని నిపుణులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: