ప్రఖ్యాత అంతర్జాతీయ విద్యాసంస్థల్లో చదువుకున్నా మూర్ఖులకు ఙ్జానోదయం కాలేదు. సరిగ్గా మాట్లాడటం కూడా రాదు. ఏ విషయంపైనైనా హోం వర్క్ చేయకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. రాష్ట్రంలో ఎన్ని నియోజక వర్గాలున్నాయో కూడా తెలియని వ్యక్తి రాష్ట్రంలో మంత్రి అవటం తమ ఖర్మ అని భావిస్తున్నారు తెలుగు రాష్ట్ర ప్రజలు. అసంబద్దమైన మాటలు. అసమగ్రమైన వ్యవహారతీరు ఆమొదయోగ్యం గాని ప్రవర్తన ఇదీ మంత్రి లోకేష్ తీరు. 
posani krishna murali comment on lokesh about nandi awards కోసం చిత్ర ఫలితం

ఆయన మాటలకు విలువుండదు. కారణం భారత్ నాగరికుడు దేశం మొత్తానికి చెందిన వారే. ఒక అధార్ కార్డ్ ఒక ఓటర్ కార్డున్నా దేశంలో ఎక్కడైనా జీవించే హక్కు కలిగి ఉండటం ఒక నాగరికునికి రాజ్యాంగం ఇస్తున్న భద్రత. ఈ భద్రత ఒక సిటిజెన్ కు ఆయన వారి నాన్నగారు ఇచ్చిన వరం కాదు రాజ్యాంగం కల్పించిన హక్కు. నాన్ రెసిడెంట్ ఆంధ్రైట్ (ఎన్.అర్.ఏ) అనేది ఏ రాజ్యాంగ మౌలిక సూత్రమో కాదు. ఒక తమిళుడు దర్శకుడుగా నిర్మించిన అర్హత గల సినిమాకు బంగారు నదులు యివ్వరా!
posani krishna murali comment on lokesh about nandi awards కోసం చిత్ర ఫలితం
ఒక ఆంధ్రుణ్ని ఆంగ్లంలో "ఆంధ్రైట్" అంటారనే సామాన్య పరిఙ్జానం కూడా లేని వ్యక్తి చదువు నేర్పిన విశ్వవిద్యాలయాల్ని నిందించాలా? ఆయన అఙ్జానికి కన్నవార్ని నిందించాలా? అసలు అర్ధం కావటం లేదు. పోసాని కృష్ణ మురళి లోకేష్ విషయం లో లేవనెత్తిన విషయాన్ని లోతుగా పరిశీలిస్తే.... ఇలాంటి రాష్ట్ర మంత్రి వర్యులను కలిగి ఉండటం జాతికే ధారుణ అవమానం. ఇంత అఙ్జాన పూరిత వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు క్రమ క్రమంగా అగ్నికి ఆజ్యం పోస్తూ రాజకీయ రంగుపులుము కుంటున్నాయి. అవార్డుల్లో తమకు అన్యాయం జరిగిందని విమర్శించడం, దీనికి ప్రతిగా నంది అవార్డులపై "ఏపీలో ఆధార్ కార్డు, ఓటు హక్కు లేనివాళ్లే" విమర్శలు చేస్తున్నారని మంత్రి నారా లోకేశ్ జనాన్ని ఉద్దేసించి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి తనకే స్వంతమైన తన దైన శైలిలో విరుచుకుపడ్డారు. 
posani krishna murali comment on lokesh about nandi awards కోసం చిత్ర ఫలితం
"తాము నాన్-ఆంధ్రా" అయితే లోకేశ్ ఎవరని ఎదురు ప్రశ్నించారు. ఏపీ ప్రజలను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ స్థాయిలో  ఏనాడూ తిట్టలేదని, రాజకీయ నాయకులను మాత్రమే ఆయన తిట్టారని పోసాని కృష్ణమురళి అన్నారు. లోకే‌శ్‌కు ఉన్న మనస్తత్వం తెలంగాణ ప్రజలకు గనక ఉంటే, మమ్మల్ని బట్టలూడేలాగ తరిమి కొట్టేవారని ఎద్దేవా చెప్పారు. తెలంగాణ వాసులు చాలా దయార్థహృద‌యుల‌ని, అమాయకులని ఈ విషయంలో వారికి తాను పాదాభివందనం చేస్తున్నానని అన్నారు. నారా లోకేష్ మంత్రి కావడం తమ ఖర్మ అని, ఆయన ముఖ్యమంత్రి అయితే, తాము "తెలుగు రోహింగ్యా" లమవుతామని విమర్శించారు.
lokesh about nra కోసం చిత్ర ఫలితం

తెలంగాణకు పన్నులు కడుతున్నంత మాత్రాన తాము ఏపీ గురించి మాట్లాడకూడదా? ఏపి లో నివసించగూడదా? వ్యాపారాలు చేసుకోగూడదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో మీకు ఇళ్లు, వ్యాపారాలు లేవా? అని నిలదీశారు. ఒకటి రెండు విమర్శలు చేసినంత మాత్రాన అవార్డులను ఎత్తేస్తారా అని మండిపడ్డారు. మనం ఒకరివైపు  "ఒక వేలు చూపిస్తే నాలుగు వేళ్ళు మనవైపే గురి పెడతాయన్న" సాధారణ ఙ్జానం కూడా లేని వ్యక్తి రాష్ట్ర మంత్రి కావటం తమ దురదృష్టమని అన్నారు. ఈ సందర్భంగా  తనకు ఆంధ్ర ప్రదేశ్ ప్రకటించిన నంది అవార్డును తిరస్కరిస్తున్నానని, "ఐవీఆర్ఎస్" ద్వారా నంది అవార్డులు ఇస్తే,అప్పుడు తీసుకుంటానని ఆయన ఉద్ఘాటించారు. 

posani krishna murali comment on lokesh about nandi awards కోసం చిత్ర ఫలితం

ప్రస్తుతం ప్రకటించిన నంది అవార్డులనులకు పవిత్రత లేదని అందువల్ల వాటిని రద్దు చేయాలని, ఐవీఆర్ఎస్ ద్వారా మళ్లీ ఎంపిక చేయాలని పోసాని కృష్ణమురళి డిమాండ్ చేశారు.

చివరగా లోకెష్ ను ఉద్దేశించి ...నీకు అసలు స్పృహ‌ ఉందా... 2014 నుంచి 2024 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని... నువ్వు తాగి మాట్లాడు తున్నావా?   చదువు కున్నవాడివేనా?  మీకు ఉన్న అర్హతేంటి? మాకులేని అర్హతేంటి?  "నాన్-ఏపీ వాళ్లను జ్యూరీలో సభ్యులుగా ఎందుకు పెట్టారని" అతి బలమైన ప్రశ్నను సంధించారు.  నీకు తెలంగాణలో నీకు ఎన్నో ఇళ్ళున్నాయి వాటికి పన్నులు కట్టవా? వ్యాపారాలున్నాయి అలాగే అందరికీను నువ్వు అక్కడ పన్నులు కట్టవా? ఏపీలో మంత్రి అవ్వవచ్చు కానీ, నీవు మంత్రై ఇక్కడికొచ్చి నీ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే అదీ రాజ్యాంగ విరుద్ధం గా మాట్లాడితే నిన్ను మేము ప్రశ్నించ కూడదా?  అని తూర్పారబట్టారు. ఇతర పార్టీలో గెలిచిన వారిని టీడీపీలో చేర్చుకున్నందుకు వైసీపీ వాళ్లు రాద్ధాంతం చేస్తే పట్టించుకోలేదు కానీ, నందులపై విమర్శిస్తే వాటిని ఎత్తేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
lokesh about nra  కోసం చిత్ర ఫలితం

ఈ సంధర్భంగా లోకెష్ విదేశాల్లో చదివినప్పుడు ఎన్.అర్.ఐ (నాన్-రెసిడెంట్ ఇండియన్) గా తన భారత పౌరసత్వాన్ని వదులుకున్నారా? లోకేష్ బాబు నీకొక నీతి ప్రజలకొక నీతా? ఇది ఒక చక్రవర్తుల ఏకచ్చత్రాధిపత్య పాలన కాదు. మీరు మీ నాన్నగారు ఈ రాష్ట్రానికి మహారాజు, యువరాజులు కాదు. ఇప్పటివరకు ఎన్.ఆర్.ఏ అనే మీ మాటను ప్రజలు మిమ్మల్ని ఒక జోకర్ గా లేక్కేసి వదిలేశారన్నది గుర్తించి ఇక దాన్ని వాడకుంటేనే మీకు క్షేమం. మీ స్వార్ధానికి పదేళ్ల హైదరాబాద్ పౌరసత్వా న్ని మీరు వదిలేసినా తెలంగాణా ప్రజలతో మమేకమైన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తమ స్నెహాన్ని మీరు పాలనలో స్థిరపడాలనే ఉద్దేశం తో ఎవరూ వదులుకోరు. మీవలన రాష్ట్రానికి పట్టిన దరిద్రం సరైన ప్రత్యామ్నాయం లేక కొనసాగుతుంది అనే విషయం గుర్తుంచుకుంటే మంచిదని ప్రజలు భావిస్తున్నారు. అధికార మధం అంతగా ఉండకూడదని చెపుతున్నా రన్నది గమనించాలి. 

lokesh about nra  కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: