ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా పదేళ్లు కాదు  15 ఏళ్ల ఇస్తామని ఆనాడు  విభజన జరిగిన సమయంలో , ఇప్పుడు  అధికారంలో ఉన్న బిజెపి ఆనాడు ప్రతిపక్షంలో  ఉండి ఇచ్చిన హామీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కేంద్రం ఈ విషయాన్ని ప్రక్కకు పెట్టేసింది. నిలదీయాల్సిన ఏపీ  రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక ప్యాకేజీ అంటూ మౌనం వహిస్తుంది. ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలలో  కొన్నాళ్లపాటు బాగానే ఉంది. ప్రజల్లో ఉన్న ప్రత్యేక హోదా సెంటిమెంట్ ను ఉద్యమం రూపకల్పనకు   తీసుకురావడంలో ప్రతిపక్షాలు  విఫలమయ్యాయి.

ప్రత్యేక హోదా మీద ప్రతిపక్ష నేత జగన్ రాజీలేని పోరాటం చేస్తున్నట్టు  ప్రతి  జిల్లాలో యువభేరిలు నిర్వహించడం సభలు పెట్టి కొంత హడావిడి చేశారు.  తరువాత ప్రత్యేక హోదా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశంగా మార్చారు. మరో నాయకుడైనా పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు అని, దానికి బదులుగా కేంద్రం ఇచ్చే ప్యాకేజీ  పాచిపోయిన లడ్డు  అని విమర్శించరు.

జనసేన విమర్శలతో ముగించిడంతో  ప్రత్యేక హోదా మీద వారి పోరాటం  ఏంటి అనేది ప్రజలకు  అర్థం కాకుండా పోయింది. ప్రస్తుతం పాదయాత్ర చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత ప్రతిరోజు తన పాదయాత్ర  ప్రసంగాలలో ప్రత్యేక హోదా అనేది సంజీవిని అని, హోదా వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు. దీంతో అధికార పార్టీలో కూడాప్రత్యేక హోదా మీద కొంతలో  కొంత స్పందన  వచ్చినట్లు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటల్లో ఒక రకమైన అభద్రత కనపడుతుంది.

గతంలో ప్రత్యేక హోదా కంటే  ప్రత్యేక ప్యాకేజీ చాలా గొప్పదని టిడిపి వారు చెప్పుకుంటూ వచ్చారు. ప్రత్యేక హోదా కు సమానంగా కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన ప్రయోజనాలేంటో ప్రజలకు వివరించలేక పోతున్నారు. తాజాగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్రం రాష్ట్రానికి హోదా ఇవ్వడం  లేదని, అందుకే  నేను ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నానని చంద్రబాబు నాయుడు మరోక్కసార్ చెప్పారు.  విభజనకు ముందు కేంద్రం ఇచ్చిన హామీలు విషయంలో రాజీ పడేది లేదని తెగేసి చెప్పారు.రాష్ట్రానికి ఎంతిస్తారో అనేది ఇంకా కేంద్రం నుంచి స్ప‌ష్ట‌త రావాల్సి ఉంద‌ని చంద్రబాబు అన్నారు.రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసేవారు ఇక్కడ కాదని ఢిల్లీ వెళ్లి పోరాటం చేయాలని ఆయన సూచించారు.

ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా ప్ర‌తిప‌క్షాన్నే ఉద్దేశించి  చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రం ఎన్నో సమస్యలతో నిండి ఉందని నిధులు చాలా అవసరమని ఎప్పుడూ తన ప్రసంగాలలో ముఖ్యమంత్రి చెబుతూ ఉంటారు…. ప్రత్యేక హోదా కాదని ప్యాకేజీ ఒప్పుకున్నా చంద్రబాబు కేంద్రంపై తాను చేస్తున్న ఒత్తిడి  ఏంటి అనేది  ప్రజలకు వ్యవహరిస్తే బాగుండేది. 


మరింత సమాచారం తెలుసుకోండి: