హైదరాబాద్ ప్రజలెంతో ఆతృతగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో రైల్ ఈ నెల 28న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ విచ్చేస్తున్నారు.  అయితే ఒకే రోజు రెండు భారీ కార్యక్రమాలకు వేదిక కానుంది హైదరాబాద్ మహానగరం.  ఈ రెండు కార్యక్రమాలకు విశిష్ఠ అతిధిగా ప్రధాని నరేంద్ర మోడీ హాజరవుతుంటే.. అంతర్జాతీయ బిజినెస్ సమ్మిట్కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా  ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. 
Image result for modi ivanka
భద్రతా పరమైన అంశాల్ని పరిగణలోకి తీసుకొని.. మోడీ.. ఇవాంకాలు ఇద్దరిని  బేగంపేట ఎయిర్ పోర్ట్ కు తీసుకురావాలన్న ఆలోచనను చేసినట్లుగా తెలుస్తోంది. ఇక.. ప్రధాని మోడీ బేగంపేట నుంచి మియాపూర్ మెట్రో స్టేషన్ వద్దకు ప్రత్యేక హెలికాఫ్టర్ లో వెళ్లనున్నారు. ఆయన కోసం అక్కడ రెండున్నర ఎకరాల స్థలంలో మూడు హెలిప్యాడ్ లను సిద్ధం చేస్తున్నారు. 
 Image result for metro rail hyderabad


ప్రధాని మోడీ టూర్ సాగేదిలా : 

- 28 మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

-  3గంటల25 నిమిషాలకు నేరుగా మియాపూర్ మెట్రో స్టేషన్ చేరుకొని మెట్రో రైల్ ను ప్రారంభిస్తారు.

- మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు 5 కిలోమీటర్లు రైలులో ప్రయాణిస్తారు...తిరగి మియాపూర్ చేరుకుని.. అక్కడే ఏర్పాటు చేయబోయే ఫొటో ఎగ్జిబిషన్ ను తిలకిస్తారు.

- మెట్రో ప్రారంభం తర్వాత హెలికాప్టర్ లో HICC చేరుకుంటారు.  ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.

-  రాత్రి 7 గంటలకు రోడ్డుమార్గంలో ఫలక్ నుమా ప్యాలెస్ లో ఏర్పాటు చేసే విందుకు హాజరయ్యి, తర్వాత 8.30 నిమిషాలకు శంషాబాద్  నుంచి తిరిగి ఢిల్లీ కి బయలు దేరుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: