ఈ మద్య తమిళనాడులో శశికళ కుటుంబ సభ్యులపై వరుస దాడులు చేస్తూ వస్తున్న ఐటీ అధికారులు.. నాలుగు రోజుల క్రితం వేద నిలయంలో దాడులు చేశారు.  అయితే వేద నిలయంలో తాజాగా ఐటీ అధికారులు చేసిన దాడుల్లో జయలలిత చివరి రోజుల్లోని వీడియో క్లిప్పింగ్స్ ఉన్నపెన్ డ్రైవ్ ఒకటి దొరికందట.  వేదనిలయం తనిఖీల్లో భాగంగా జయలలిత వ్యక్తిగత సహాయకుడు పూంగుండ్రన్, నెచ్చెలి శశికళ గదుల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అధికారులకు ఒక పెన్‌డ్రైవ్ లభ్యమైనట్టు తెలుస్తోంది.

 అపస్మారక స్థితిలో:

కేవలం అపస్మారక స్థితిలో ఉన్న జయలలితను ఆసుపత్రికి తరలించేందుకు గంటముందు నమోదైన సీసీటీవీ దృశ్యాలతో పాటు, జయలలిత చికిత్సకు సంబంధించిన దృశ్యాలు కూడా అందులో ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.   చివరి రోజుల్లో ఆమె వాస్తవ పరిస్థితి గురించి ఎరిగినవాళ్లలో శశికళ తప్ప మరొకరు లేరు. నిజానికి జయలలిత అంతరంగీక జీవితంలో ఎవరికీ తెలియని రహస్యాలు చాలానే ఉన్నాయంటారు. ఇప్పటి వరకు అవి అన్నీ సీక్రెట్ గానే ఉండిపోయాయి. 

 డెత్ సీక్రెట్?:

కనీసం ఆమె చివరి రోజుల్లో ఎలా ఉన్నారన్న దానికి సంబంధించి ఫోటోలు గానీ వీడియోలు గానీ బయటకు రాలేదు. తాజాగా ఐటీ అధికారులు చేసిన దాడుల్లో జయలలిత చివరి రోజుల్లోని వీడియో క్లిప్పింగ్స్ ఉన్నపెన్ డ్రైవ్ ఒకటి దొరకడంతో ఇప్పుడు కొత్త నిజాలు వెలుగులోకి వస్తాయిని అమ్మ అభిమానులు అనుకుంటున్నారు.

Image result for jayalalitha murder

మరోవైపు జయ మృతిపై ఏవైనా వివరాలు తెలిస్తే చెప్పాలంటూ జస్టిస్‌ ఆరుముగస్వామి నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. జయలలిత మృతిపై విచారణలో భాగంగా అవసరమైతే ప్రస్తుత తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం సహా మరికొంతమంది మంత్రులను విచారించాలని కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: