తన స్వప్రయోజనాల దగ్గరకు వస్తే చైనాకు మిత్రదేశమైనా శత్రుదేశమైనా ఒక్కటే. ఇది ఇప్పటికే శ్రీలకంక, నేపల్, భూటాన్, మాలే, జింబాబ్వే లు ఇప్పుడు గొల్లుమంటూ విలపిస్తున్నాయి లోలోపలే. అయితే సర్పం తో ఇంత ప్రమాదమో తెలుసు కుంటుంది పాకిస్థాన్ ఇప్పుడిప్పుడే. 

diamer bhasha Dam on sindhu river కోసం చిత్ర ఫలితం

ఆ సందర్భంగానే తమ అత్యంత మిత్ర దేశం చైనాకు పాకిస్థాన్ ఝలక్ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో దాయాది దేశం "డియామర్ భాషా" పేరుతో ఒక డ్యామ్‌ను నిర్మిస్తోంది. దీని నిర్మాణానికి అయ్యే 14 బిలియన్ డాలర్లు రుణాన్ని మంజూరు చేయడానికి చైనా ముందుకొచ్చింది. కానీ కఠిన నియమ నిబంధనలను విధించింది. ప్రాజెక్ట్ ప్రయోజనా లు మొత్తం చైనా గుప్పిట్లో ఉండేలా ఉన్న నిబంధనలు చూసి పాక్‌కు చిర్రెత్తుకొచ్చింది. వాస్తవానికి 60 బిలియన్ డాలర్ల వ్యయం చేపడుతున్న చైనా పాక్ ఆర్థిక కారిడార్‌ లో ఈ ప్రాజెక్ట్ కూడా భాగం. చైనా ఉద్దేశాలు అర్థమైన పాక్, "సీపీఈసీ" నుంచి ఈ ప్రాజెక్ట్‌ను మినహా యించాలని కోరింది. దీంతో చినా ఒక ప్రయొజనానికి రెండు చోట్ల ఋణం సృష్టించిన విధానం చూసి పాకిస్తాన్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది. చైనా నమ్మక ద్రోహం ఎలాంటిదో ఇప్పుడిప్పుడే తెలుసుకుంటూంది.  

diamer bhasha Dam on sindhu river కోసం చిత్ర ఫలితం

పాకిస్థాన్ ఆక్రమిత కస్మీర్ లో సింధునదిపై పాక్ చేపడుతున్న ఈ ప్రాజెక్టు‌పై భారత్ కూడా తన అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. దీంతో వివాదాస్పదమైన ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్, ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ముందుకు రావడం లేదు. ఇదే అదనుగా చైనా శరణుజొచ్చిన పాక్ కు అదను చూసి వేటేసే చైనా కఠినమైన నిబంధనలు విధించింది. డ్రాగన్ తీరుతో బిక్క చచ్చి అవాక్కైన పాకిస్థాన్, సొంత నిధులతోనే డ్యామ్ నిర్మాణానికి సమాయత్త మౌతుంది. 


4500 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన, భారీ నీటి నిల్వ సామర్థ్యం లక్ష్యాలుగా పాకిస్థాన్ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తోంది. ఇది తమ నీటి అవసరాల్ని గణనీయంగా తీర్చ గలదని నమ్మకంతో పాక్ ఉంది.

diamer bhasha Dam on sindhu river కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: