పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 15వ తేదీ నుంచి జనవరి 5వ తేదీ వరకు జరగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా తెలిపింది.  గత కొన్ని రోజుల నుంచి గుజరాత్ లో ఎన్నికల సందర్భంగా అధికార పక్షం బిజెపి, ప్రతి పక్ష కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారం సాగిస్తున్నారు.  ఇప్పటికే రాహుల్ గాంధీ ప్రచారం కొనసాగిస్తుండగా..త్వరలో మోడీ కూడా ప్రచారం చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. 

ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచే పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని పార్లమెంట్ వ్యవహారాల కమిటీ బుధవారం సమావేశమై సంబంధిత తేదీల్లో పార్లమెంట్ సమావేశాలను నడిపేందుకు చర్చించి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

ఈ సమావేశాల్లోనే బీసీ జాతీయ కమీషన్‌ బిల్లుకు ఆమోదం లభించే అవకాశం ఉంది. త్రిపుల్  తలాక్  బిల్లుతో పాటూ పలు కీలక బిల్లులను ఈ సమావేశాల్లోనే సభ ముందుకు తీసుకురావాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు కసరత్తు కూడా ప్రారంభించినట్లు సమాచారం. ఐతే వింటర్  సెషన్స్  ను కావాలనే కేంద్రం ఆలస్యం చేస్తోందని కాంగ్రెస్  సహా విపక్షాలు ఆరోపించాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: