ఇవాంకా ట్రంప్ ఒక అగ్ర రాజ్యాధినేత కుమార్తెగా భారత్ లో ఒక అధికార హోదాలో భారత్ సందర్శనకు వచ్చేటప్పుడు ఆమె మన ముందు అధికార దర్పం ప్రదర్శించ వచ్చు. కాని ఆమె కూడా ఒక సాధారణ అమ్మాయే. అతి సాధారణ మనసున్న అమ్మాయే. అదేమంటే:


తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాలపట్టి ఇవాంకా ట్రంప్ వైట్‌ హౌస్ ప్రధాన సలహాదారు హోదాలో
హైదరాబాద్‌  వేదికగా ఈ నెల 28 న జరిగే "గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌కు-(జి ఇ ఎస్)"  ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇవాంకా పర్యటన నేపథ్యంలో భాగ్యనగరం కొత్త అందాలు సంతరించుకొని మరింత అందంగా ముస్తాబయ్యింది. గత నెల రోజులు నుంచి ఈ సదస్సు కోసం ఏర్పాట్లు అతి వేగంగా ముమ్మరంగా సాగుతున్నాయి.
Image result for ivanka reaching hyderabad

వచ్చేది సాధారణ వ్యక్తి కాదు అగ్రరాజ్యాధిపతి కుమార్తె మరి. ఆమెతోపాటు ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర రాష్ట్రాల ముఖ్య మంత్రులు, ప్రపంచంలోని వ్యాపార దిగ్గజాలు, ఇతర ప్రముఖులు కూడా 'జి ఇ ఎస్' కు హాజరుకానున్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరో వైపు అమెరికా భద్రతాధికారులు నెల రోజుల కిందటే హైదరాబాద్‌ కు చేరుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.


అయితే ఈ సందర్భంగా ఇవాంకా వివాహానికి సంబంధించి ఆసక్తి కరమైన విషయం బయటకు వచ్చింది. ఆమె తన ప్రియుడి కోసం క్రైస్తవాన్ని వదలి జ్యూయిష్ మాతాన్ని స్వీకరించింది. న్యూయార్క్‌ కు చెందిన 'వేండ్ డెంగ్ ముర్దోక్' అనే కామన్ ఫ్రెండ్ ద్వారా 2005 ఆగస్టు 22 న 'జారెడ్ కుష్నర్‌' ను ఇవాంకా ట్రంప్ తొలిసారి కలిసింది. ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు కలవడం తో మూడేళ్ల పాటు సహజీవనం చేశారు. అయితే ఈ విషయం తెలిసి, సంప్రదాయ యూదులైన కుష్నర్ కుటుంబం దీనికి అభ్యంతరం తెలపడంతో విడిపోయారట. అంతేకాదు ఒక అంతర్జాతీయ సంపన్న వ్యక్తి కూతురు, మన లాంటి సాధారణ కుటుంబంలో ఎలా ఇమిడి ఉండగలదని వారు ముందుగా అభిప్రాయపడ్డారు.

Related image

తమ ప్రేమకు మతం అడ్డంకిగా మారిందని తెలుసుకున్న ఇవాంకా క్రైస్తవాన్ని వదిలి "యూదు మతం" స్వీకరించింది. అలాగే తనకు అంతస్తులతో పనిలేదని తెలిపింది. దీంతో ఇవాంకా ను తమ కొడలిగా చేసుకోడానికి కుష్నర్ తల్లిదండ్రులు చార్లెస్, సెర్యియల్ కుష్నర్ అంగీకరించారు. ఇవాంకా నిర్ణయానికి ట్రంప్ కూడా మద్దతుపలకడంతో 2009లో 'జారెడ్  కుష్నర్‌' ను వివాహం  చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇవాంకను కుష్నర్ ఎంతగానో ప్రేమించి నా  మతం అనే అంశం ప్రత్యేక పాత్ర పోషించింది.

Image result for ivanka trump wedding


దీనికి తోట రాముడి ప్రేమకు పడిపోయిన రాకుమారిలాగా ఇవాంకా కుష్నర్ ను స్వంతం చేసుకుంది. లవ్ ఈజ్ గ్రేట్. 

Related image

మరింత సమాచారం తెలుసుకోండి: