తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మేనల్లుడు  హరీష్ రావు.. ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కేసీఆర్తో పాటు ఎంతో కృషి చేశారు.ఇప్పుడు కూడా కెసిఆర్ అడుగుజాడల్లోనే బంగారు తెలంగాణ కోసం కష్టపడుతున్నారు. నిరంతరం అధికార కార్యక్రమాలలో  బిజీ  బిజీగా ఉండే హరీష్ రావు ఒక్కరోజే 30 పెళ్లి వేడుకలకు హాజరై రాజకీయనాయకులను  అబ్బురపరిచారు.

తెలంగాణ రాష్ట్ర రాజధాని భాగ్యనగరం అయిన  హైదరాబాద్ నుండి 600 కిలోమీటర్లు ప్రయాణించి మరికొన్ని వివాహ కార్యక్రమాలకు హాజరై జంటలను దీవించారు.. ఈరోజు ముహుర్తాలు ఎక్కువగా  ఉండటం తో ..వివాహాలు కూడా బాగా ఉన్నయ్..దానితో మంత్రి హరీష్ రావు గారు బిజి బిజి అయ్యారు….ఎప్పుడూ ప్రభుత్వ కార్యక్రమాలలో అధికారులతో సదస్సులు సమావేశాలలో బిజీగా ఉండే మంత్రి హరీష్ రావు ఉదయం ఎనిమిది గంటలు  నుండి మధ్యాహ్నం వరకు హైదరాబాదులో 16 వివాహ కార్యక్రమాలకు హాజరయ్యారు.

తరువాత సిద్దిపేటలో దాదాపు 14 వివాహ వేడుకలకు హాజరై మొత్తం 30 కార్యక్రమాల్లో పెళ్లి కుటుంబాలలో ఒక కుటుంబ సభ్యునిగా వారి ఆనందంలో పాలు పంచుకుంటూ పార్టీ నాయకులను, కార్యకర్తలను, అధికారులను, శ్రేయోభిలాషులను అందరిని కలుపుకుంటూ పోయారు. తెలంగాణ కుటుంబంలో కుటుంబ సభ్యునిగా మాదిరి కరమైన నాయకుడిగా హాజరై నేటి తరం నాయకులకు ఎలా ఉండాలో ఆదర్శంవంతమైన నాయకునిగా నిలిచారు.

సాధారణంగా రాజకీయ నాయకులు అదీ మంత్రి స్థానం లో ఉండి చక్రం తిప్పే వారు  కార్యకర్తల , చిన్న నాయకుల పెళ్ళిళ్ళ వరకూ వెళ్ళడం అంటే అది చాలా పెద్ద వింత. కానీ మాస్ జనాలని ఎలా ఆకట్టుకోవాలి, వారిలో ఒకడిగా ఎలా కలిసిపోవాలి అనేది హరీశ్ రావు కి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలీదు. కెసిఆర్ తరవాత తెలంగాణా లో అంతటి మాస్ లీడర్ అంటే హరీష్ పేరే చెప్తారు చాలామంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: