ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సాక్షిగా గురువారం (30.11.2019) కేంద్రప్రభుత్వం పై దుమ్మెత్తి పోశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్ట్‌ విషయంలో కేంద్రం అడ్డంకులు సృష్టి స్తోందని ఆ నేపథ్యంలో ఆగ్ర హోదగృలై, దాదాపు వీరభద్రుడే అయ్యారు.


పోలవరం ప్రోజెక్ట్ "మీరే పూర్తి చేస్తారా? అలాఇతే ఇప్పటి కిప్పుడు ప్రాజెక్ట్‌ ని మీకే అప్పగించేయడానికి  సిద్ధం. ఇప్పుడు ప్రాజెక్ట్‌ ఆగిపోతే ఇక కట్టలేం. చాలా విషయాల్లో సంయమనం పాటించాం. అభివృద్ధి విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు" అంటూ చంద్రబాబు ఆవేశకావేశాలు ప్రకటిస్తుంటే, "ఏమిటీ! ఇదంతా నిజమేనా? " ఆంధ్రప్రదేశ్ లో చాలామందికి రాష్ట్రం వెలుపల కొందరికి అను మానం కలిగింది.

chandrababu naidu and narendra modi కోసం చిత్ర ఫలితం

కానీ, చంద్రబాబులో ఎప్పుడూ రెండు కోణాలు కనిపిస్తున్టాయి. ఒక కోణం రౌద్రం భయానకం  అనిపిస్తూ ఏదో జరిగి పోనుందనే దృశ్యం కన్పిస్తోంటే, మరో కోణంలో అత్యంత అమాయకత్వంతోకూడి సర్దుకుందాంలే! అనె బేలతనం ప్రస్పుటమౌతుంది. అదే చంద్రబాబు స్పెషాలిటీ. మొన్న అలాకేంద్రంపై ఆగ్రహోదగ్రుడై అగ్నికెరటంలా మండి పోయిన చంద్రబాబు, నేడు చాలా అమాయకంగా బేలగా జనానికి జాలి ఉప్పొంగేలా పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి "కేంద్రాన్నిఏమీ అనొద్దు" అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. "కేంద్రంతో కలిసి ముందుకు వెళుతున్నాం! అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో బీజేపీతో కలిసి పనిచేస్తు న్నాం. ఈ పరిస్థితుల్లో నోటి కొచ్చినట్లు మాట్లాడటం సబబుకాదు" అంటూ పార్టీ ముఖ్యనేతల సమావేశంలో చంద్రబాబు చిలక పలుకులు పలికారు. 


"ప్రాజెక్ట్‌ విషయంలోరాజీపడొద్దు.అలాగని కేంద్రాన్ని తొందరపడి విమర్శించొద్దు. కేంద్రంతో మాట్లాడేందుకు ప్రయత్నిద్దాం. కేంద్రమే వేగంగా నిర్మిస్తామని చెబితే, ఇచ్చే ద్దాం!" అని తెలుగు దేశం పార్టీ నేతలకు చంద్రబాబు మెత్తని అదేశించటం, దాని కి తగ్గట్టుగా టీడీపీ నేతలు నిన్నటి  'ఆవేశం' తగ్గించి, 'సుతిమెత్తగా'కథలు చెప్పడం అన్నీ చకచకా జరిగిపోయాయి 


నిన్న అసలు ఆవేశపడిందీ చంద్రబాబే, నేడు ఆలోచనలో పడిందీ చంద్రబాబే. నిన్న కేంద్రంపై అగ్రహాగ్ని రగిల్చింది చంద్ర బాబే, ఈ రోజు కేంద్రం పట్ల అపారమైన అభి మానం  ప్రదర్శించింది చంద్రబాబే. చంద్రబాబు చరిత్రహీనుడు అవనున్నాడా!

polavaram chandrababu centre కోసం చిత్ర ఫలితం

ఈ కథ మనకు నేర్పిన నీతిఏమంటే? ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది ప్రయోజనాలతో చంద్రబాబుకి సంబంధంలేదనీ కేంద్ర ప్రభుత్వంతో వ్యక్తి గత స్నేహం ముందు చంద్ర బాబు రాష్ట్ర ప్రయోజనాల్ని ఏమీ గమనించకుండానే అతి తేలికగా పణంగా పెట్టేయడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం కాదని అర్థమవటం లేదూ! దటీజ్‌ నారా చంద్రబాబు నాయుడు. అదే లోపూచీ లాలూచి వ్యవహారమని ఉండవల్లి అరుణ కుమార్ వివరించిన వీడియో చూడండి.


చంద్రబాబు బలహీనతను వెల్లడించిన టిడిపి  సానుభూతితో తరించే ఆంధ్రజ్యోతి ప్రచురించిన ఈ వార్త చంద్రబాబు ఆత్మ న్యూనత ను చెప్పకనే చెప్పింది. 


బీజేపీ మన టార్గెట్‌ కాదని, ప్రజా సమస్యల పరిష్కారమే మన లక్ష్యమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టుకు సాయం చేయలేమని కేంద్రం చెబితే ఒక నమస్కారం పెట్టి తప్పుకొంటామని గురువారం తాను చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపిన నేపథ్యంలో శుక్రవారమిక్కడ జరిగిన టీడీఎల్పీ సమావేశంలో మీడియా ప్రతినిధులు వెళ్లిపోయాక సీఎం మాట్లాడారు. ‘కేంద్రంలో మన బలంతో ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కూడా మనం పదవుల కోసం వెంపర్లాడలేదు. వాజ్‌పేయి ప్రభుత్వంలో మనకు ఏడు మంత్రి పదవులు ఇస్తామని చెప్పినా ఒక్కటి కూడా తీసుకోలేదు.


 కేంద్రంతో సంబంధ బాంధవ్యాల కోసం జీఎంసీ బాలయోగికి స్పీకర్‌ పదవి తీసుకున్నాం. ఇప్పుడు కూడా అవే సంబంధాల కోసం రెండు మంత్రి పదవులు తీసుకున్నాం. మనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. అంతే తప్ప కేంద్రాన్ని మనం మరేమీ కోరడం లేదు. ప్రజల్లో సెంటిమెంట్‌ దెబ్బ తినకుండా చూసుకోవాలి. అది దెబ్బ తినడంతో 132 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అడ్రస్‌ లేకుండా పోయింది. ఎంతో చరిత్ర గల కుటుంబాలు కూడా ఆ సునామీలో కొట్టుకుపోయాయి. మన బలం మనకు ముఖ్యం. మన ప్రవర్తనను బట్టే మనపై సానుకూలత లేదా ప్రతికూలత వస్తాయి. నిత్యం ప్రజల్లో ఉండాలి. గ్రామాల్లో తిరగాలి’ అని నేతలకు హితవు పలికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: