chandra babu swanta dabbaa self praise కోసం చిత్ర ఫలితం


సత్య నాదెళ్ళ ఐటి విద్యలో చేరటానికి ప్రోత్సహించింది నేనే. ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఆంగ్ల విద్య, సాంకేతిక విద్యలు నేర్పించింది నేనే. హైదరాబాద్ ను ప్రపంచ పటం లో పెట్టింది నేనే. మెట్రో రైల్ సృష్టికర్త ను నేనే. విశాఖపట్నానికి సముద్రాన్ని, హైదరాబాద్ కు హుసేన్ సాగర్ ను,  విజయవాడకు అమ్మ కనకదుర్గను రప్పించింది నేనే  అని ఇలా అయిన  దానికి కాని దానికి అంతా నేనే అని డప్పు కొట్టుకుంటున్న తెలుగుదేశం అధినేత ఆ అనుచరమంత్రులు, ప్రజాప్రతినిధి గణాల స్వంత బ్రాండింగ్ కు ఇక అడ్డుకట్ట పడ్డట్టే.

chandra babu with MoDi కోసం చిత్ర ఫలితం

అన్నింటికీ కారణం నేనే. నీవు నిమిత్తమాత్రుడివి అని అంటూ, అటు ప్రజలకు ఇటు కేంద్ర ప్రభుత్వానికి "చంద్ర గీత" భోదిస్తే పడి ఉండటానికి ప్రధాని వాజపాయి కాదు. అతని కంటే ఘనుడు ఆచంటి  మల్లన్న అనబడే  "నరెంద్ర మోడి" -పేరు లోనే "నమో" ఇముడ్చుకున్న మరో అపర సర్వాంతర్యామి,  "భగవద్గీత" ను భోదించింది నేనే అనగల ధీమంతుడు అతి తేలిగ్గా చంద్రబాబును "ఢీ" కొట్టగలవాడు. ప్రపంచ దేశాధిపతులను మిత్రులుగా చేసుకొని చైనానే ఒక ఆట ఆడించినవాడు. తన క్రెడిట్ వేరెవాడు తీసుకుంటే ఊర్కుంటాడా! 
KCR MoDi in Metro Rail inauguration కోసం చిత్ర ఫలితం
"హెడ్ మాస్టారి ముందు వినమ్ర విద్యార్ధి" బహు ఙ్జాని - ఎక్కడ తగ్గాలో తెలిసిన అతి వినయ సంపన్నుడు 


తన ఫొటో కి అడ్డొస్తే ట్రంప్ నే కంపు చేయగల ధీశాలి ఆయన. పాకిస్థాన్ చైనా విషయంలో ట్రంప్ చేతే బ్రతిమాలించుకున్న రాజకీయ చతురుడు ఆయన. "మోడీ అనే హనుమంతుని ముందు చంద్రబాబు కుప్పిగంతులు" ఇక పనిచేయవని నిరూపిం చారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ కు లభించే తమ నుండి అందే సహాయంపై కేంద్రం దృష్టి పెట్టి మరీ ఆ పనులు తాము అందించిన నిధుల తోనే కొనసాగుతున్నాయని తామూ ప్రచారం చేసుకోవటానికి కేంద్రం సిద్ధపడుతుంది. దీని కంతకు కారణం "చంద్ర బాబు కీరి ఖండూతి" మాత్రమే. కేసిఆర్ ను చూడండి "కొండ అద్దమందు కొంచెమై ఉండదా!" అనే సామెతకు సరిగా సరి పోబట్టే "మోడీయమాత్యుని" అనుగ్రం అతి సునాయాసంగా పొందగలిగాడు. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు బహుచతురుడు. సమయస్పూర్తి వంటపట్టించుకున్న ఙ్జాని. 


KCR MoDi in Metro Rail inauguration కోసం చిత్ర ఫలితం

"సమయస్పూర్తి వంటపట్టించుకున్న ఙ్జాని" KCR


ఆంధ్ర ప్రదేశ్ కు ఈ సమయం లో ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణం - "క్రెడిట్ కొట్టేయటం కాదు. లేని క్రెడిట్ కూడా యివ్వటం" అప్పుడే రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి, దాంతో ప్రత్యేక పాకేజీ రెండూ కొట్టెయవచ్చు. భోళా శంకరుని అనుగ్రహం పొందటం బహుతేలిక "జస్ట్ నమో! నీ వినా దారి లేదు" అంటే మహరాష్ట్ర కొచ్చినట్లే నిధుల వరద మనపై పారి ఉండేది. ఆంధ్రాకు దురదృషటం శని చంద్రబాబు రూపంలో పట్టింది. బాబు కాకుండా ఏ అశోక గజపతి రాజో ముఖ్యమంత్రి అయి ఉంటే నేటికి అమరావతి భ్రమరావతి గా కాకుండా ఆ స్వర్గ పురాదీశుని దేవెంద్రనగరం దివ్యధామంలా శోభించే అమరావతి అయి ఉండేది. చంద్రబాబుకు తన వంది మాగదుల మర్ధనమే సరిపోదు. ఆయన్ని ఆయన తనయుడు లోకేష్ మనవడు దేవాన్ష్ ను కూడా ప్రతిరోజు శత శహస్రనామాలతో పొగిడేసే వందిమాగధుల "స్వకుచ మర్ధనం" సరిపోని ఈయన "పరకుచ మర్ధనం" ఏమి చేయగలడు, చేయించగలడు. అంతా మన తలరాత. 

chandra babu swanta dabbaa self praise కోసం చిత్ర ఫలితం

సార్వం సహా సార్వభౌముడు 


కేంద్రం రాష్ట్రానికిచ్చే నిధుల సరపరాకు రాష్ట్రంలో తాత్కాలికంగా విరామం ఇచ్చింది. ఇప్పటినుండి కేంద్ర నిధులతో వివిధ కార్యక్రమాలు చేపట్టాలంటే తాజా మార్గదర్శకాల ప్రిదిలో పనులు నిర్వహిస్తేనే తదుపరి నిధులు వస్తాయని షరతులతో కూడిన విధి విధానాలు అమల్లోకి వచ్చాయి. కేంద్ర నిధులతో చేపట్టే పనుల్లో ఎక్కడా కేంద్రం ప్రస్తావన లేకుండా రాష్టమ్రే నిర్వహిస్తుందనే భ్రమ కలిగిస్తూ ఇప్పటివరకు రాష్ట్రమే పనులు చేపడుతున్న విధంగా రాష్ట్ర ప్రజల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నట్లు గమనించిన ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ప్రభుత్వ సర్వే బృందాలు ఇచ్చిన నివేదికతోపాటు, ఇక్కడి బీజేపీ నేతల ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్రంలో ఖర్చు చేసే కేంద్ర నిధులకు తాత్కాలికంగా విరామం ప్రకటించిన్ అట్లు తెలుస్తుంది. 

upadi hami pathakam in ap కోసం చిత్ర ఫలితం
"ఈయనిది అహంభావమో అమాయకత్వమో కూడా తెలిచ్చావదు!"


"ఉపాధి హామీ పథకం"తోపాటు వివిధ పథకాలకు సంబంధించి గ్రామాల్లో జరిగే పనులకు గత 15 రోజుల నుంచి నిధులు నిలిచి పోయాయి. ప్రధానంగా రాష్ట్రం చేపట్టిన "ఎన్టీఆర్ హౌసింగ్ పథకం" లో ఉపాధి హామీ పథకం వాటా నిధులు ఆగి పోయాయి. "ఎన్టీఆర్ హౌసింగ్ పథకం" లో యూనిట్‌కు రూ.58 వేల చొప్పున "ఉపాధి హామీ పథకం నిధులు" మిళితమై ఉన్నాయి. ఈ నిధు ల విడుదల నిలిచిపోవడంతో ప్రస్తుతం గృహ నిర్మాణ పథకం పురోగతి ఆగిపోనుంది. సకాలం లో చెల్లింపులు జరగకపోవటం తో లబ్ధిదారులు అందోళన చెందుతున్నారు. 

upadi hami pathakam in ap కోసం చిత్ర ఫలితం

కేంద్రనిధులతో రాష్ట్రంలో జరుగుతోన్నపనులపై ఇటీవల కేంద్ర బృందం క్షేత్ర స్థాయి లో సర్వేచేసి నివేదిక సమర్పించింది. కేంద్ర నిధులతో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతున్నట్టు ప్రచారం జరుగుతోందని ఈ బృందం గుర్తించిందని చెబుతున్నారు. కొన్ని పనులకు చంద్రబాబు పేరు పెట్టుకున్నట్టు కేంద్ర బృందాలు గుర్తించాయ ని సమాచారం. "ప్రధానమంత్రి ఆవాస యోజన" కు తెలుగు దేశం "ఎన్.టి.ఆర్ హౌజింగ్ పథకం" అని స్వంత పేరుపెట్టింది. 

upadi hami pathakam in ap కోసం చిత్ర ఫలితం


ఇందులో ప్రధానంగా "చంద్రన్న బీమా పథకం" (ఉపాధి హామీ పథకం) గురించి ప్రస్తావించినట్టు తెలుస్తుంది. అనేక పనులపై అధికారులు కేంద్ర బృందానికి ఇచ్చిన వివరాలకు, పనులు జరుగుతున్నచోట స్థానికులు చెప్పిన విషయాలు విరుద్ధంగా ఉన్నాయని బృందం గుర్తించినట్టు సమాచారం. పూర్తయిన పనుల వద్ద ఈ బృందం ఆరా తీసినపుడు రాష్ట్ర నిధులతో పను లు జరిగాయని ప్రచారం జరుగుతోందని, దీన్ని బట్టి కేంద్రం నయా పైసా కూడా ఇవ్వలేదనే అభిప్రాయం స్థానికంగా ప్రజల్లో వెల్లడౌతుందని తమ నివేదిక ద్వారా వివరించినట్లు  తెలిసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర నిధులతో గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లు తదితర మౌలిక సదుపాయాల పనులూ నిలిచిపోయాయి. ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన పనులకు ఎక్కడా యంత్రాలను వినియోగించకూడదు. 
NTR housing pathakam కోసం చిత్ర ఫలితం
ఒక సీసీ రోడ్డు నిర్మాణానికి సగం నిధులు ఉపాధి హామీ పథకం నుంచి విడుదలైతే, మిగిలిన సగం నిధులు పంచాయతీలకు 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విడుదలవుతాయి. ఈ రెండూ కేంద్రం నుంచి వచ్చేవే. ఆర్థిక సంఘం నిధులు పంచాయ తీల్లో వీధి లైట్లు, పారిశుద్ధ్యం, మంచినీరు, ఇతర మౌలిక సదుపాయాలకు మాత్రమే వినియోగించాల్సివుంది. కేంద్రం నుంచి ఈ నిధులు నేరుగా స్థానిక పంచాయతీ ఖాతాల్లోనే పడుతున్నాయి. 

NTR housing pathakam కోసం చిత్ర ఫలితం

అయితే ఎమ్మెల్యేల అనుమతితో స్థానిక ప్రజాప్రతినిధులు వీటిని వినియోగించేలా ఏర్పాట్లు చేసినట్టు బృందం గుర్తించింది. "కేంద్ర నిధుల పై రాష్ట్రం పెత్తనం" చెలాయిస్తోందని, పథకాలు కేంద్రానివైనా, పేరు మాత్రం రాష్ట్రానికే దక్కుతుందని కొంత bమంది భారతీయ జనతా పార్టీ నేతలు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. మొత్తం మీద అటు కేంద్ర బృందం సర్వే, ఇటు బీజేపీ నేతల ఫిర్యాదుల కారణంగా వీటికి కేంద్రం నుండి లభించే నిధులను తాత్కాలికంగా ఆపేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు నూతన మార్గదర్శకాలు, విధివిధానాల ప్రకారం "ఉపాధి హామీ పథకం పనులు" ముందుకు జరగాలంటే కేంద్రం కొన్ని షరతు లు విధించినట్లు తెలుస్తోంది. ఇప్పటి నుండి ఒక కూలీ తనకు పని కావాలని అభ్యర్దిస్తూ ముందుగా దరఖాస్తు తీసుకోవాలి. ఆ కూలీకి పనులు ఇవ్వటానికి అంగీకరించినట్టు అధికారులు తీర్మానించాలి. పంచాయతీ స్థాయిలో పని తాలూకు అంశం చర్చించినట్లు తీర్మానం ఉండాలి. 

NTR housing pathakam కోసం చిత్ర ఫలితం

ఆ పని తప్పని అవసరమని సంబంధిత అధికారి నివేదిక ఇవ్వాలి. ఆయా పనులకు అయ్యే అంచనా వ్యయం ముందే నిర్ణయించాలి. సంబంధిత పని పూర్తయ్యాక ఎన్నిరోజులైతే  ఉపాధి పొందారో దానికి "కూలీల ధ్రువీకరణ పత్రాలు" వాటితో పాటు నిర్ధారించే హాజరు పట్టికలు (మస్టర్లు) ప్రతీ పనికీ ఉండాలని కొత్త మార్గదర్శకాల్లో నిర్దేశించారు. ఈ తాజా మార్గదర్శకాల ప్రకారం పనులు చేసి రాష్ట వ్య్రాప్తంగా జిల్లాల వ్యాప్తంగా సంపూర్ణ వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాల్సివుంది. ఈ నివేదికతో సంతృప్తి చెందితే తప్ప వచ్చే ఏడాది "ఉపాధి హామీ పథకం నిధులు" కేంద్రం నుండి వచ్చే వెసులుబాటు లేదు. ఇక కొత్తగా పనులు చేపట్టాలంటే కేంద్రం సూచించిన విధి విధానాలు, మార్గదర్శకాలు పాటించటం  తప్పనిసరి చేశారు. ఈ మేరకు ఆగిపోయిన పనులకు కొత్త అనుమతుల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు.

chandra babu with MoDi కోసం చిత్ర ఫలితం

కనీసం ఇకనైనా ఇలా మోడీ ముందు తలవంచితే ఓకే- లేకుంటే ....

మరింత సమాచారం తెలుసుకోండి: