ఈ మద్య తమిళనాడులో ప్రతిరోజూ ఏదో ఒక సెన్సేషన్ అవుతూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.  ఇప్పటికే పన్నీర్ సెల్వం, శశికళ రాజకీయ యుద్దం ముగిసిందీ అనుకున్న తర్వాత కమల్ హాసన్ రాజకీయ రంగం ప్రవేశంతో సరికొత్త ఊహాగానాలు మొదలయ్యాయి.  తాజాగా ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.  ఆర్కే నగర్ ఉప ఎన్నికల బరిలోకి దిగుతామనుకున్న నటుడు విశాల్‌కు చుక్కెదురైంది. విశాల్‌తో పాటు జయలలిత కోడలు దీపా జయకుమార్, మరికొందరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.   
 బెదిరించారని చెబుతూ విశాల్ ఆడియో విడుదల
జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కే నగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు విశాల్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఈ ఎన్నికలో విశాల్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాడు. సోమవారంతో నామినేషన్ల గడువు ముగియడంతో అధికారులు మంగళవారం వాటిని పరిశీలించారు.   విశాల్ నామినేషన్ సందర్భంగా 10 మంది ప్రపొజర్స్ సంతకం చేశారు. ఇందులో ఇద్దరి సంతకం ఫోర్జరీ అని ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. అకస్మాత్తుగా తెరపైకి వచ్చిన సుమతి, దీపన్‌లు ఆ సంతకాలు  తమవి కావని, ఫోర్జరీ చేశారని ఆరోపిస్తూ రిటర్నింగ్ అధికారికి లిఖితపూర్వకంగా తెలిపారు.

దీంతో విశాల్ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దీనిపై విశాల్ స్పందించారు. ఆ ఇద్దరిని అన్నాడీఎంకే పార్టీ బెదిరించిందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఓ ఆడియో కూడా విడుదల చేశారు. అన్నాడీఎంకేలోని మధుసూదన్ వర్గం ఆ ఇద్దరిని బెదిరించిందన్నారు. ఆ వీడియోలో తన మద్దతుదారుల స్టేట్‌మెంటును ఉంచినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ ఆడియో టేప్‌ను విశాల్ మీడియాకు విడుదల చేయడంతోపాటు రిటర్నింగ్ అధికారికి కూడా అందించారు.
it was mockery of democracy, says Actor Vishal  - Sakshi
చీఫ్ ఎన్నికల కమిషనర్ ఏకే జ్యోతితోనూ విశాల్ మాట్లాడాడు. దీంతో రాత్రి 8:30 గంటల వేళ విశాల్ నామినేషన్‌ను స్వీకరిస్తున్నట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఈసీ నిర్ణయంపై విశాల్ హర్షం వ్యక్తం చేయగా, ఆయన మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. అయితే రాత్రి 11 గంటలప్పుడు సీన్ మరోసారి మారిపోయింది. విశాల్ నామినేషన్‌పై సంతకాలు పెట్టిన సుమతి, దీపన్‌లు స్వయంగా ఈసీ కార్యాలయానికి వచ్చి ఆ సంతకాలు తమవి కావని తేల్చి చెప్పారు. దీంతో ఆడియో టేపులను పరిగణనలోకి తీసుకోలేమని చెప్పిన అధికారులు విశాల్ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: