వైయస్ఆర్ సీపీ పార్టీ పోలవరం ప్రాజెక్టు  పనుల పరిశీలనకు ఆ పార్టీ కి  చెందిన ప్రజాప్రతినిధులతో వెళ్లారు. అయితే ఈ క్రమంలో వైయస్సార్సీ పార్టీ కంటే ముందుగానే పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టుకు దగ్గరికి వెళ్లడంతో మీడియా ఫోకస్ అంతా జనసేన వైపు మళ్లింది. ఆ తర్వాత వెళ్ళిన వైయస్ఆర్ సీపీ పార్టీ ప్రజాప్రతినిధులకు వచ్చిన స్పష్టత   ఏంటి? ప్రతిపక్ష నేత ఆరోపించినట్లు అక్కడ ఏమైనా అవినీతి బట్టబయలైందా? అనేది తెలీదు.

అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏడాదిలో ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు ఉందా లేద‌న్న‌ది వారికి అర్థ‌మైందా..? వైయస్ఆర్సీపీ చేపట్టిన పర్యటన ద్వారా పార్టీ నేత‌ల‌కు అర్థ‌మైందేంటీ..?ఇలాంటి ప్రశ్నలు వేసుకొంటే భిన్నమైన అభిప్రాయాలు కనపడుతున్నాయి. పోలవరం లో  వైయస్ఆర్సిపి ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గడచిన రెండు రోజులుగా పోలవరం ప్రాజెక్టు దగ్గర ఎటువంటి పనులూ  జరగడంలేదని ఆరోపించారు .. 

వైయస్ఆర్ సీపీ పార్టీ తలపెట్టిన ఈ పర్యటన వల్ల ప్రాజెక్టు సైట్ వ‌ద్ద ప‌నులు జ‌రుగుతున్న హ‌డావుడి వారికి క‌నిపించింద‌నేది వారి ఆరోపణ.  ఈ పర్యటన వల్ల వైయస్ఆర్సీపీ నాయకులకు ఏటువంటి స్పష్టత రాలేదు అని చెప్పవచ్చు.

ఎందుకంటే అక్క‌డి అధికారుల స‌హాయనిరాక‌ర‌ణ‌ గానీ లేద‌నీ, తాము అడిగిన స‌మాచార‌మంతా అక్క‌డున్న ఇంజినీర్లు ఇచ్చార‌నీ వైకాపా నేత‌లే మీడియా ప్ర‌తినిధుల‌తో ఆఫ్ ద రికార్డ్ చెప్పిన‌ట్టు తెలుస్తోంది.ఏదేమైనా, వైకాపా నేత‌ల‌కంటే ప‌వ‌న్ క‌ల్యాణ్ ముందుగా పోల‌వ‌రం ప్రాజెక్టుకు వెళ్ల‌డంతో… ఫోక‌స్ అంతా ప‌వర్ స్టార్ వైపే మ‌ళ్లింద‌న‌డంలో సందేహం లేదు. పోలవరం లో ఏదో బయట పెట్టాలి అనుకున్న వైకాపా కి ఎల్లో మీడియా తో పాటు పవన్ కూడా గట్టి దెబ్బే వేసాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: