తాజాగా తెలంగాణా టీడీపీ లోనుంచి తెలంగాణా కాంగ్రెస్ లోకి జంప్ అయిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చాలా కాలం తరవాత నోరు తెరిచారు. రానున 2019 ఎన్నికలు ధర్మ యుద్ధమే అంటూ సీరియస్ గా చెప్పుకొచ్చారు ఆయన. కెసిఆర్ పాలన పోవాలి అంటూ సోనియా గాంధే పుట్టిన రోజు నాడు తన మొదటి మాటలు మాట్లాడారు రేవంత్.


టీపీసీసీ ఇవాళ హైదరాబాద్ లో సోనియా పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యెక కార్యక్రమం ఏర్పాటు చేసింది దానికి వచ్చిన ఆయన డిసెంబర్ 9 న తెలంగాణా కోసం ప్రత్యెక ప్రకటన చేసిన మహా మనిషి సోనియా గాంధీ అన్నారు.నేటి నుంచి కేసీఆర్ వ్య‌తిరేక పున‌రేకీక‌ర‌ణ జ‌ర‌గాల‌ని అన్నారు. సోనియా గాంధీ, కాంగ్రెస్ వ‌ల్ల తెలంగాణ వ‌స్తే.. నలుగురి కుటుంబ పాల‌న వ‌ల్ల తెలంగాణ అల్లాడిపోతోంద‌ని అన్నారు. ఇప్ప‌టికీ ఆత్మ‌ బ‌లిదానాలు ఆగ‌లేద‌ని అన్నారు.


తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికే తాము కాంగ్రెస్‌లో చేరామ‌ని అన్నారు. టీడీపీ లో ఉన్నంత కాలం మరీ ఎక్కువగా చంద్రబాబు కి భజన చెయ్యని రేవంత్ ఇలా సడన్ గా కాంగ్రెస్ లోకి రాగానే సోనియా భజన మొదలు పెట్టడం హాస్యాస్పదం గా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: