ప్లాన్ స‌క్సెస్ అవ్వాలే కానీ.. రాజ‌కీయాల్లో తాడి త‌న్నేవాడుంటే త‌ల‌త‌న్నేవాడు మ‌రొక‌డుంటాడంటారు! అచ్చు.. కాంగ్రెస్ ఈ ఫార్ములానే ఎంచుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. దేశంలో గ‌త రెండు నెల‌లుగా తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారిన గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో అక్క‌డ అత్యంత బ‌లంగా ఉన్న బీజేపీని త‌రిమి కొట్టాల‌ని, త‌ద్వారా ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ హ‌వాకు తెర‌దించాల‌ని కాంగ్రెస్ సార‌ధులు పెద్ద ప్లాన్ వేసుకున్నారు. దాదాపు 20 ఏళ్ల‌కు పైగా గుజ‌రాత్‌లో బీజేపీ పాగా వేసింది. గాంధీ పుట్టిన రాష్ట్రంలో గాంధీ వార‌సుల‌కు చోటే లేకుండా చేసింది. మ‌రి అలాంటి పార్టీపై కాంగ్రెస్ నేత‌లు ఎంత క‌సి పెంచుకుని ఉంటారో చెప్ప‌డం క‌ష్టం కాదు క‌దా?! ఈ క్ర‌మంలోనే గుజ‌రాత్‌ను త‌మ అధీనంలోకి తెచ్చుకునేందుకు కాంగ్రెస్ అనేక ఎత్తులు వేసింది. మేధావుల‌ను రంగంలోకి దింపింది. 

pm modi wife jashodaben కోసం చిత్ర ఫలితం

ఇక‌, మోడీతో సై అంటే సై అంటున్న ప‌టేళ్ల సామాజిక వ‌ర్గానికి చెందిన యువ నేత హార్ధిక్ ప‌టేల్‌ను త‌మ‌వైపు తిప్పుకొంది కాంగ్రెస్‌. మోడీ ఇవ్వ‌ని రిజ‌ర్వేష‌న్‌ను తాము ఇస్తామ‌ని హామీ కూడా ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప‌టేళ్ల రిజ‌ర్వేష‌న్‌పై అసెంబ్లీలో బిల్లు కూడా పెడ‌తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ ప‌రిణామం నిజంగా.. మోడీ ఆయ‌న ప‌రివారానికి ఎదురు గాలిగానే భావించాల్సి ఉంటుంది. ఇక, కాంగ్రెస్ అంత‌టితో ఆగిపోయి ఉంటే ప్ర‌స్తుతం ఇప్పుడు మ‌నం ఈ క‌థ‌నం చ‌దువుకోవాల్సిన అవ‌స‌రం ఉండేది కాదేమో! మోడీని బ‌ద్నాం చేసేందుకు, మోడీ హ‌వాను మ‌ట్టిక‌రిపించేందుకు కాంగ్రెస్ ఇంత‌క‌న్నా పెద్ద ప్లాన్ వేసింది. ఏకంగా ఆయ‌న స‌తీమ‌ణినే త‌మ ట్రాప్ లోకి లాగాల‌ని కాంగ్రెస్ నేత‌లు ప్ర‌య‌త్నించారు. అయితే, అనూహ్యంగా కాంగ్రెస్ పెద్ద‌ల ప్లాన్ ఫ‌లించ‌లేద‌ని తాజాగా వెలుగు చూసింది. 


ఇప్ప‌టి వ‌ర‌కు మోడీ భార్య‌న‌ని చెప్పుకొంటున్న జ‌సోదాబెన్‌ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుని, అత్యంత కీల‌క‌మైన అహ్మ‌దాబాద్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆమెకు అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వాల‌ని కాంగ్రెస్ భావించింద‌ట‌. అయితే, ఆమె ఈప్ర‌తిపాద‌న‌కు తిర‌స్క‌రించింద‌ట‌. ఇప్పుడు ఈ విష‌యం జాతీయ రాజ‌కీయాల్లో పెద్ద సంచ‌ల‌నంగా మారి.. పెను దుమారానికి కూడా కేంద్ర బిందువు అయింది. విష‌యంలోకి వెళ్తే.. మోడీ సతీమణి జసోదాబెన్‌ను గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నిలబెట్టాలని ఆ పార్టీ నేతలు నేరుగా ఆమెను సంప్రదించారట. అయితే జసోదాబెన్ మాత్రం సున్నితంగా వారి కోరికను తిరస్కరించారట. జసోదాబెన్ తోటికోడలు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 

pm modi wife jashodaben కోసం చిత్ర ఫలితం

జసోదాబెన్‌కు గుజరాత్‌ నుంచి పోటీలోకి దింపాలని కాంగ్రెస్ తమ కుటుంబాన్ని సంప్రదించిందని, అయితే అందుకు జసోదాబెన్ విముఖత చూపారని ఆమె వెల్లడించారు. కాగా, దేశం కోసం తన భర్త అహరహం శ్రమిస్తుండటం, కుటుంబం కన్నా దేశమే మిన్నగా భావించే భర్త తనకు లభించడం ఎంతో గర్వంగా ఉందని జసోదాబెన్ త‌న వారితో చెప్పిన‌ట్టు తోటికోడ‌లు వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి ఈ విష‌యం వెలుగు చూడ‌డంతో కాంగ్రెస్ త‌న బ‌లాన్ని పెంచుకునే బ‌దులు.. మోడీ హ‌వాను త‌గ్గించే ప‌నిలో ప‌డింద‌నే వ్యాఖ్య‌లు వినిపించాయి. .


మరింత సమాచారం తెలుసుకోండి: