భారత దేశంలో క్లాసికల్ డ్యాన్స్ కి పెట్టింది పేరు.  అయితే సాంప్రదాయ నాట్యం నేర్చుకున్న వారు ఏ వయసులో అయినా సరే మర్చిపోరని ఓ బామ్మ నిరూపించింది.  1956లో బాలీవుడ్ లో  వచ్చిన పరివార్ సినిమాలో లతామంగేష్కర్ పాడిన ఓ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

లతామంగేష్కర్ పాడిన ఓ పాట ఇప్పుడు వైరల్ కావడం ఏంటా అనుకుంటున్నారా..అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉందండీ..ఈ పాటపై 70 సంవత్సరాల బామ్మ పాటకు డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. 

అధ్బుతమైన స్టెప్పులతో  వీడియోలో 1.5 నిమిషాల పాటు డాన్స్ చేసింది.  డిసెంబర్6 న పోస్ట్ చేసిన ఆ వీడియో ఇప్పటి వరకు 1 లక్ష షేర్లు,లైక్ లతో సోషల్ మీడియాలో దూసుకెళ్తుంది. అయితే కొంత మంది నెటిజన్లు తమ బామ్మలను మిస్ అవుతున్నామని ఇలాంటి బామ్మలను చూస్తుంటే ఎంతో స్ఫూర్తి అనిపిస్తుందని కామెంట్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: