టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల వివాహం గతరాత్రి ఇటలీలో సంప్రదాయ బద్ధంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వివాహంపై వారిద్దరు సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చేయగా.. పలువురు ప్రముఖులు ఈ కొత్త దంపతులకు అభినందనలు తెలిపారు.జీవితంలో ఎప్పటికీ ప్రేమానుబంధం మధ్య కలిసి ఉంటామని నేడు మేమిద్దరం ఒకరికి ఒకరం ప్రమాణం చేసుకున్నాం.
Kohli, Anushka
ఈ వార్తను మీ అందరితో పంచుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా కుటుంబసభ్యులు, అభిమానులు, బంధుమిత్రుల మద్దతుతో, ప్రేమ, ఆశీస్సులతో ఈ రోజు మరింత ప్రత్యేకంగా మారింది.  ఇటలీలోని మిలాన్‌లో పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంటకు పలువురు క్రికెటర్లు, బాలీవుడ్ ప్రముఖులు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పారు. 2013లో ఓ వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో భాగంగా వీరిద్దరికీ పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరిద్దరి పెళ్లి అంశం నెట్‌లో ప్రతి నిత్యం హాట్ టాపిక్‌గా ఉండేది.   
kohli
క్రికెట్ మ్యాచ్‌లో కోహ్లీ విఫలమైన ప్రతీసారి అనుష్క వైపే వేలెత్తి చూపేవారు. ఒకానొక సందర్భంలో ఇలా ఆమెను నిందించడం సిగ్గుచేటు అని కోహ్లీ ట్వీట్ కూడా చేశాడంటే ఈ జంటను ఏ రేంజ్‌లో టీజ్ చేసేవారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Image result for kohli marriage
మా ప్రయాణంలో పాలుపంచుకున్నందుకు కృత జ్ఞతలు" అని విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. విరాట్ ను వరించేందుకు అనుష్క పూలమాలను తీసుకురాగా, ఆయన్ను పైకెత్తి పట్టుకున్న చిత్రాన్ని పోస్టు చేశాడు. కోహ్లీ ట్వీట్ లక్షలాది లైక్స్, వేలాది షేర్స్ తెచ్చుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: