ప్రపంచంలో అత్యంత సురక్షిత మరియు ఆధునిక రవాణా వ్యవస్థను కలిగి ఉన్న దేశం జ‌పాన్‌. రైల్వే నిర్వన కు ఆ దేశానికి గొప్ప చ‌రిత్ర ఉంది. "జపాన్‌ బుల్లెట్‌ రైలు" ఆ దేశపు రైల్వే ర‌వాణా వ్య‌వ‌స్థ‌కు చిహ్నం. జపాన్ రవానా వ్యవస్థకే  తలమానికమైన బుల్లెట్ రైల్ ఒక దానిలో ప‌గుళ్లు ఏర్ప‌డ‌టం ఒక సంచలనంగా మారింది. ఇప్పుడు ఈ విషయం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 

cracks in japan bullet train కోసం చిత్ర ఫలితం

ఈ సంఘట్టనపై సంబందిత అధికారులు స్పందిస్తూ "ఆ వార్త‌లు నిజ‌మేన‌ని, ఒక బుల్లెట్‌ రైలు లో పగుళ్లు ఏర్పడ్డాయని అవి పెను ప్రమాదానికి దారితీసేవే" నని జపాన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ లో ఇలాంటి ప్రమాదకరమైన ఘటనలు ఇప్పటి వరకూ ఎన్నడూ చోటుచేసుకోలేదని తెలిపారు. వివరాల్లోకెళితే సోమవారం దక్షిణ జపాన్‌ ప్రాంతంలో ప్రయాణిస్తున్న "షింకన్‌సేన్‌ బుల్లెట్‌ ట్రైన్‌" లో కాలిన వాసన, వింతైన శబ్దాలు రావడాన్ని అందులో ఉన్న సిబ్బంది గమనించిన వెంటనే రైలును సెంట్రల్‌ జపాన్‌ లోని నాగోయా స్టేషన్‌లో నిలిపి తనిఖీలు నిర్వహించారు. 

shinkansen bullet train కోసం చిత్ర ఫలితం

ఒక స్టీల్ ఫ్రేమ్‌ లో పగుళ్లు రావడాన్ని అధికారులు గుర్తించారు. పగుళ్ళ నుండి ఇంధనం లీక్‌ అవుతున్నట్లు కూడా గమనిం చారు. ఇదే పరిస్థితిలో రైలు ముందుకు కదిలితే, రైలు పట్టాలు తప్పే ప్రమాదం ఉండేదని వెల్లడించారు. అదృష్ట వశాత్తు ఒక దురదృష్టకర ప్రమాధం తప్పింది. ఆ సమయంలో రైలులో దాదాపు వెయ్యి మంది ప్రయాణికు లు ఉన్నారు. వేరే రైళ్లల్లో వారి ని గమ్యస్థానాలకు చేర్చారు. 

shinkansen bullet train కోసం చిత్ర ఫలితం

2001లో "బుల్లెట్‌ ట్రైన్‌ సేఫ్టీ బోర్డు" ను జపాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇలాంటి ఘటన ఎప్పుడూ చోటుచేసు కోలేదు. ఇదే తొలి సంఘటన అని అధికారులు చెబుతున్నారు. "ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు ముగ్గురు ఇన్‌స్పెక్టర్లను పంపించాం. వారిచ్చే నివేదిక భవిష్యత్‌ లో ఇలాంటి వాటిని నిరోధించేందుకు ఉపయోగపడు తుందని" రవాణా అధికారులు వెల్ల‌డించారు.

cracks in japan bullet train కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: