ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్ష నేత జగన్ కు సంబంధించి తమ పార్టీ సీనియర్ నాయకులకు కొన్ని ఆదేశా లు జారీ చేశారు ఏమిటంటే జగన్ ప్రభుత్వాన్ని, నన్ను ఎన్ని విమర్శలు  చేసిన వాటికి కౌంటర్లు ఇవ్వడం, తిరిగి ప్ర‌త్యారోప‌ణ‌లు చేయడం వంటివి చేయవద్దు అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని సమాచారం... ప్రస్తుతం ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ రోజురోజుకూ దిగజారిపోతుందని అన్నారు.

అలాగే మరియు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గ్రాఫ్ ప్రజలలో పెరుగుతుందని చంద్ర బాబు పరిపాలనపై రాష్ట్ర ప్రజలు సంతృప్తికరంగా ఉన్నట్లు స‌ర్వేల ద్వారా ఎప్ప‌టిక‌ప్పుడు స‌మాచారాన్ని సేక‌రిస్తున్న చంద్ర‌బాబు వాటిని మంత్రులు, సీనియ‌ర్ నేత‌ల ముందు పెడుతున్నార‌ట‌. జగన్ పై మనం చేసే ప్రతి విమర్శ మీడియాలో టెలికాస్ట్ అవుతున్నాయ‌ని, జ‌గ‌న్‌ని లైట్ తీసుకుంటే ఆయ‌న‌ని మీడియా కూడా ప‌ట్టించుకోద‌ని స‌ల‌హా ఇచ్చార‌ట‌.

ఈ సందర్బంగా  జగన్ మనలను ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దంటూ తన పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు అని తెలుస్తోంది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సీనియర్ నాయకులు అంగీకరించారు, జగన్ ఎంత పట్టించుకోకుంటే అంత మంచిదని కొంతమంది అన్నారట దాని వల్ల జగన్ ప్రాధన్యత ప్రజలలో తగ్గుతుంది అని అన్నారు.

దీనికి చంద్రబాబు  ప్రతిస్పందిస్తూ  తన వెర్షన్ కూడా అదే అంటూ వ్యాఖ్యానించారట .జ‌గ‌న్‌ని సాక్షి మిన‌హా మ‌రే ఛానెల్ ప‌ట్టించుకోవ‌డం లేదు. ముఖ్యంగా ఆయ‌న పాద‌యాత్ర‌కు స‌రైన స్పంద‌న రావ‌డం లేదు. ఇలాంటి టైమ్‌లో టీడీపీ నేత‌లే జ‌గ‌న్‌ ని హైలైట్ చేసి, మీడియాలో ఫోక‌స్ చేయ‌డం వేస్ట్ అని చంద్ర‌బాబు ఓ అంచ‌నాకు వ‌చ్చార‌ట‌. 


మరింత సమాచారం తెలుసుకోండి: