ఈ మద్య చాలా మంది ఈజి మనీ కోసం అక్రమదారుల్లో వెళ్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నారు.  ముఖ్యంగా అమాయక మహిళలు, మోడల్స్ ని చేరదీసి వారితో హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తూ.. విటులను ఆన్‌లైన్ ద్వారా ఆకర్షిస్తూ కొంత మంది దుర్మార్గులు అడ్డదారుల్లో అక్రమంగా సంపాదిస్తున్నారు.   తాజాగా ఓ వ్యభిచార ముఠా గుట్టును ఎస్‌ఓటీ పోలీసులు రట్టు చేశారు.
Related image
మేడ్చల్ జిల్లాలోని ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాద్రి టౌన్ షిప్ లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందడంతో, అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు.  వీరిలో సినీ సహాయ దర్శకుడు, సినీ ఆర్టిస్ట్ తో పాటు ముగ్గురు మోడల్స్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
Image result for prostitution hyderabad
గత కొంత కాలంగా మేడ్చల్ జిల్లాలో ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల వెంకటాద్రి టౌన్‌షిప్‌లో ఓ ఇళ్లు అద్దెకు తీసుకొని సదరు నిర్వాహకులు విటులను ఆన్‌లైన్ ద్వారా ఆకర్షిస్తూ వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. 
Image result for prostitution hyderabad
పక్కా సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు ఘట్‌కేసర్‌లోని ఓ ఇంటిపై దాడులు జరిపారు. వారిని ఎస్‌ఓటీ పోలీసులు   ఘట్‌కేసర్‌ పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: