ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా అమెరికా యాత్ర చేస్తున్న ఏపీ మంత్రి నారా లోకేశ్ అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. ఇప్పటికే గూగుల్ వంటి కంపెనీల నుంచి సానుకూల ఫలితాలు రాబట్టిన లోకేశ్.. ఇతర దిగ్గజ కంపెనీల నుంచి కూడా ఏపీకి పెట్టుబడులు వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని హిటాచి కంపెనీ కార్యాలయంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓట్సుకి ని మంత్రి నారా లోకేశ్‌ కలిశారు. సచివాలయంలో రియల్ టైం గవర్నెన్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటులో హిటాచి కంపెనీ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

Image result for it ministers lokesh america tour

సెన్సార్ల ఏర్పాటు ద్వారా వ్యవసాయంలో అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు హిటాచి హెల్ప్ ఎంతో అవసరమని నారా లోకేశ్ ఆ కంపెనీని రిక్వెస్ట్ చేశారు. ఏపీకి ఓ టీమ్ ను పంపాలని కోరారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో సోషల్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని నారా లోకేశ్ హిటాచి కంపెనీని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తో కలిసి పనిచెయ్యడానికి సిద్ధంగా ఉన్నామని హిటాచి కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓట్సు తెలపడం విశేషం.

Image result for it ministers lokesh america tour

హిటాచి సీఈవోతో పాటు వివిధ కంపెనీల్లో అత్యున్నత పదవుల్లో ఉన్న సిఎక్స్ఓలతో కూడా మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనువైన పరిస్థితుల గురించి మంత్రి వివరించారు. . ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున టెక్నాలజీని వినియోగిస్తుందని నారా లోకేశ్ వివరించారు. ఏపీ అభివృద్దిలో పాలుపంచుకోడవం ద్వారా మీరు కూడా అభివృద్ధి సాధించవచ్చని నారా లోకేశ్ వారికి వివరించారు..


నారా లోకేశ్ పర్యటన అప్పుడే మంచి ఫలితాలు సాధిస్తోంది. ఆయన తన పర్యటనలో దాదాపు ఓ పది వరకూ దిగ్గజ సంస్థలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. వీటిలో కనీసం సగమైనా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తే... ఏపీ ఐటీ పురోగభివృద్ది జోరందుకోడవం ఖాయం. ఇప్పటికే గూగుల్ ఎక్స్ విశాఖకు వచ్చేందుకు అంగీకరించిన విషయం తెలిసిందే.. నారా లోకేశ్ తపన చూసిన వారు.. అప్పట్లో చంద్రబాబు కష్టాన్ని గుర్తు చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: