తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాదులో తెలుగు మహాసభలు నిర్వహిస్తుంది.. ఈ క్రమంలో పక్క   తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి అయినా నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించకపోవడం ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశం అయింది. ఒకవేళ ఈ సభలకు సీఎం చంద్రబాబు వస్తే తాను సెకండరీ అయిపోతాడని కెసిఆర్ భావిస్తున్నట్లు టిఆర్ఎస్ లో అంతర్గతంగా జరుగుతున్న ప్రచారం. రీసెంట్ గా  ప్రారంభమైన ఈ వేడుకను ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రారంభ సభలో ప్రసంగించిన కెసిఆర్ తనదైన శైలిలో ప్రసంగించారు.

అయితే ఆ సభలకు ఏపీ నుంచి చంద్రబాబు ను  ఎవరిని పిలవకపోవడంపై మాత్రం చర్చ జరుగుతూనే ఉంది. చంద్రబాబు పిలవక పోవడానికి గల కారణం ఒక్కటే ఆయనను పిలిస్తే మొత్తం ఫోకస్ అంతా ఆయన మీద వుంటుందని అది ఇష్టం లేకే కెసిఆర్ ఆహ్వానించలేదు అని కొంతమంది అంటున్నారు. అందుకే తెలుగు మహాసభలను తెలంగాణ పండుగగా నిర్వహిస్తోంది తెలంగాణ సర్కార్.

ఈ విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను ఆంధ్రా మీడియా కు సంబంధించిన ఓ  విలేఖరి  ‘తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సభలకు మిమ్మల్ని పిలవలేదు కదా! మీ కామెంట్‌ ఏమిటి?’’ అని ప్రశ్నించగా…చంద్రబాబు ప్రతిస్పందిస్తూ ‘‘నన్ను పిలవకపోయినా ఫర్వాలేదు. తెలుగువారం ఎక్కడ ఉన్నా మన భాషను గౌరవించుకోవాలి.

భాషను కాపాడుకోవాలి.తెలుగు మహాసభలు ఎక్కడ జరిగినా తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలుపుతుంది. తెలుగువారంతా కలిసి ఉండాలన్నది మా ఆకాంక్ష. ఎవరు ఎక్కడ ఉన్నా మనమంతా తెలుగు వారమన్న స్ఫూర్తి పోకూడదు’ అని చంద్రబాబు బదులిచ్చారు.తనను పిలవకపోయినా చంద్రబాబు చాలా హుందాగా తెలుగువాడి గా ప్రతిస్పందించారని రెండు తెలుగు రాష్ట్రాల పరువు నిలబెట్టారని రాజకీయ వర్గాలుఅంటున్నాయి 


మరింత సమాచారం తెలుసుకోండి: