ప్రస్తుతం తెలుగుదేశం ఎంపీలంతా ఎమ్మెల్యేలు అవ్వాలని పట్టు బిగించి కూర్చున్నారు…. ఈ క్రమంలో తాము ఎక్కడైతే వచ్చేఎన్నికలలో నిలబడాలనుకొంటున్నరో ఆ నియోజక వర్గాల మీద కర్చీఫ్ వేసుకుని మరీ ఆ ప్లేస్ నాదే .. ఈ ప్లేస్ నాదే అంటూ అడ్వాన్స్ బుకింగ్ చేసేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఒకరిద్దరు కాదు చాలామంది యంపీలు ఈ ధోరణిలో ఆలోచిస్తున్నారు.

రాబోయే ఎన్నికలలో మాకు మాత్రం ఎట్టి పరిస్థితి లో ఎమ్మెల్యే టికెట్ కావాలని ఆశిస్తున్నారు. ఇలా  టికెట్ ఆశించే వారి వివరాలు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, హిందూపురం ఎంపీ నిమ్మల, కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు, ఏలూరు ఎంపీ మాగంటి బాబు తదితరులు, తమకు వచ్చేసారి ఎంపీ సీట్లు వద్దు ఎమ్మెల్యే సీట్లు కావాలి అంటూ అధినేతకు విన్నవించుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యే సిట్ అయితే పెద్దగా కష్టపడక్కర్లేదు అని  ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి  అవచ్చని వీరి భావన. ఒకవేళ ఎంపీ గా గెలిచినా కేంద్ర మంత్రి అయే అవకాశాలు ఉండవని, మామూలుగానే తమ రాజకీయ జీవితం కొనసాగుతుందని వీరి  ఆలోచన.

అలాగే ఎన్నికల ఖర్చు కూడా పెరిగిపోవడంతో వీరు ఆందోళన చెందుతున్నారు. మరియు ఎమ్మెల్యే సీట్ అయితే పరిధి తక్కువ ఉంటుంది అని, ఎంపీ సీటు అయితే విస్తీర్ణం ఎక్కువనీ .. దీని వల్ల ఖర్చు కూడా పెరుగుతుందని వీరి భావన.వీరి కోరిక ఇలా ఉంటే మరి ఆ పార్టీ అధినేత ఆలోచన ఎలా ఉందో తెలియదు కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: