ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన రాజధానిగా ఎంపికైన అమరావతి ప్రాంతంలో కొండవీటి వాగు ఎన్నో వందల ఏళ్లుగా ప్రవహిస్తుంది.  ఈ వాగు సంస్కృతి, సాంప్రదాయాలకు, ప్రతిరూపంగా నిలిచింది, కొన్ని దశాబ్దాల, శతాబ్దాల నుంచీ  ఈ వాగు కు  ఎంతో చరిత్ర ఉంది. ఈ వాగు అందాల మ‌ధ్యే ఆంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తిని నిర్మించ‌డానికి చంద్ర‌బాబు స‌ర్కారు రెడీ  అవుతోంది.

ఆ మధ్య కొందరు గ్రీన్  ట్రిబ్యునల్ లో ఈ కొండవీటి వాగు కి సంబంధించి కేసు వేశారు. నదీ తీర ప్రాంతాలలో రాజధాని నిర్మిస్తే వరద ముప్పు ఉంటుందని విమర్శలు చేశారు. వరదలు , వానలు వస్తే అమరావతి కూడా మరో చెన్నయ్ ముంబై ఔతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో చాలామంది కొండవీటి వాగు కనుమరుగవుతుందని అనుకొన్నారు.  చంద్రబాబు నాయుడు కొండవీటి వాగును అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతూ అమరావతి నగరం అంతటా ప్రవహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ఈ క్రమంలో కొండవీటి వాగు నీటిని శుభ్ర  పరుస్తున్నారు కూడా . ఒకవిధంగా కొండవీటి వాగు లండన్ పక్కనే ఉన్న థేమ్స్ న‌దిలా ప్రవహించేలా చేస్తున్నారు. ప్రస్తుతం అమరావతి గ్రాఫిక్స్ రూపంలో కనిపిస్తున్న వీడియోలు ఆ నీటి ప్రవాహం కొండవీటి వాగు దేనని ఈ వాగు వల్ల అమరావతి నగరానికి మరింత క్షోభ విరాజిల్లుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది భ్ర‌మ‌రావ‌తి కాదు.. అమ‌రావ‌తి అని విమ‌ర్శ‌కులకు చెక్ ప‌డే రోజు త్వ‌ర‌లోనే రానుంది అంటున్నారు టీడీపీ జనాలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: