తెలంగాణ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలుగు మహాసభలు ఘనంగా జరుగుతున్నాయి .తెలుగు సంస్కృతిని, తెలుగుభాష, తెలుగు జాతి ఖ్యాతి ని ప్రపంచానికి తెలియజేయడానికి నిర్వహిస్తున్న ఈ సభలు  తెలంగాణా ప్రభుత్వం వండర్ఫుల్ గా ప్లాన్ చేసింది. ఇప్పటిదాకా జరిగిన సభలో తెలంగాణ సంస్కృతిని చాటడంలో, అలాగే తెలంగాణ సాహితీ యోధులను ప్రస్తుత తరానికి పరిచయం చేయటంలో తెలంగాణ సర్కార్ విజయవంతమైనప్పటికీ.ఈ సభలో విషయమై కొన్ని అభ్యంతరాలు ప్రశ్నలు చర్చకు దారితీశాయి. 

ప్రముఖ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ కుటుంబానికి తెలుగు మహాసభలకు ఆహ్వాన రాకపోవడంపై రావూరిని తెలంగాణ సర్కార్ మర్చిపోవడం పై రావూరి కుటుంబ సభ్యులు ఆవేదన చెందారు. అలాగే ప్రజా ఉద్యమ నాయకుడు సామాజిక వేత్త గద్దర్ ని కూడా మర్చిపోవడం చాలామందికి మింగుడుపడడం లేదు.ఈ క్రమంలో రాజకీయ విమర్శలు కూడా లేవనెత్తాయి ఈ మహాసభలు నేపథ్యంలో ఒకప్పుడు కెసిఆర్ “ఎవడి తెలుగు తల్లి, ఎక్కడి తెలుగు తల్లి” అంటూ  ప్రశ్నించిన విషయాన్ని ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసిన రేవంత్ రెడ్డి గులాబీ దళానికి కాస్త చెమటలు పట్టించే ప్రయత్నం చేసారు.

అయితే ఏ వృక్షమూ లేని చోట ఆముదపు వృక్షమే మహావృక్షం అన్నట్టు తెలుగు గురించి ఈ మాత్రమైనా తెలంగాణా ప్రభుత్వం పట్టించుకుంది, ఎవరిని స్మరించినా ఎవరిని విస్మరించినా, సభలు జరిపింది, అదే పది వేలు. నిన్న కెసిఆర్ ఈ సభలో మాట్లాడిన తీరు అందరినీ ఆకట్టుకుంది. మొత్తం మీద కాస్త మంచి కాస్త చెడు టైపు లో ఈ సభ నడుస్తూ ఆఖరి రోజు ఐన ఇవాళ కి చేరుకుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: