రాజబోగాలు అనుభవించాల్సిన రాకుమారుడు జగన్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 484 రోజులు జైలులో  దయనీయ జీవితం గడిపారు. అంతటి సుకుమార శరీరం ఓ ఇరుకైన గదిలో జైలులో గడిపిన జీవితం నిజంగా జగన్ ఓర్పు, సహనం, పట్టుదల, అనుకున్నదానికోసం దేనికైనా సిద్దపడగల తెగింపు, తలవంచని ఆత్మాభిమానం వంటి వాటికి నిలువెత్తు నిదర్శనాలు అనడంలో సందేహం లేదు.

ఎట్టకేలకు జగన్ జైలుగోడలను చీల్చుకుని వచ్చేస్తున్నాడు, అయితే అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న ఇన్నాళ్లు ఆయన జైలులో ఎలా గడిపాడు, ఈ 16 నెలల కాలంలో ఎన్నో వేడుకలు ఆయన ఎదుటకు వస్తే కుటుంబసభ్యులు దగ్గర లేకుండా ఎలా జరుపుకున్నాడు, చివరకు ఆయన పెళ్లి రోజు, పుట్టినరోజు, తండ్రి వైఎస్సార్ వర్ధంతి ఇలాంటివి ఎన్నో ఆయన తన వారికి దూరంగా జరుపుకొన్న దయనీయ పరిస్థితి జగన్ ది.

2012 మే 27 న సిబిఐ అరెస్టు చేసి మరుసటి రోజు అంటే మే 28న జగన్ ను చంచల్ గూడ జైలుకు తరలించింది. అక్కడ ఆయనకు పది చదరపు అడుగులు విస్తీర్ణం ఉన్న ఓ గదిని కేటాయించారు. ప్రత్యేక ఖైదీగా గుర్తింపు పొందడంలో ఆయనకో మంచం, పరుపు, కుర్చీ, టేబుల్, టివీ వంటి సౌకర్యాలు మాత్రం కల్పించారు. ఇక ఆయన దినచర్య విషయానికి వస్తే రోజు ఉదయం, సాయంత్ర యోగా చేసి, అనంతరం షటిల్ ఆడేవారు జగన్.

తర్వాత స్నానం చేసి దైవ ప్రార్థన చేసుకుని అల్పాహారం తీసుకునే వాడు. తెలుగు, ఆంగ్ల దినపత్రికలు చదివే వాడు. జైలుకు పోయిన మొదట్లో తన తోటి విఐపి ఖైదీలతో అంటీ అంటనట్టుగా ఉన్న జగన్ తర్వాత మెల్లమెల్లగా అందరితో కలిసి తన అనుభవాలు పంచుకోవడం మొదలుపెట్టారు. ఆయన అవసరాలను ఆయన అనుచరుడు సునీల్ రెడ్డి దగ్గరుండి చూసుకునే వాడు.

ఈ కాలంలో వైఎస్ వర్దంతి, తన పుట్టిన రోజు, పెళ్లి రోజు జైలులోనే తనతోటి విఐపి ఖైదీల మద్య జరుపుకున్నారు. భార్యబారతి, తల్లి విజయమ్మలు వారానికోసారి ములాఖాత్ లలో కలిసి వెల్లేవారు. ఇక పార్టీలోకి చేరాలనుకునేవారు, పార్టీ వైఖరిపై అలిగే వారు కూడా ములాఖాత్ లలో ఆయనను కలిసి విషయాలు వివరించేవారట. ఆయన సలహాలు తీసుకుని వెల్లేవారు. ఇదీ క్లుప్తంగా ఆయన 484 రోజుల పాటు జైలులో గడిపిన తీరు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: