జగన్ బెయిల్ తో తెలంగాణకు విముక్తి లభించింది, ఆయనకు జైలునుంచి విముక్తి లభిస్తే తెలంగాణకు ఆంద్రప్రదేశ్ నుంచి స్వేచ్చ లభించింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అదేంటి ఆయన జైలు నుంచి వచ్చి పోరాడేదే సమైక్యాంధ్ర గూర్చి, రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా చేసేందుకు ఆయన ఉద్యమ బాట పట్టనున్నాడు, ఇప్పటికే సమైక్యవాదులు ఆయనను ఉద్యమంలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు కూడా, అలాంటిది ఇలా రివర్స్ లో  అంటారేంటి అనుకుంటున్నారా..

ఇందులోనే అసలు రాజకీయం ఉందని తెలంగాణ వాదులు, రాజకీయులు అంటున్నారు. పక్కా విభజన వాది, తెల్లారితే షర్మిలతో సహా వైఎస్సార్ సిపి నేతలు దయ్యంలా పోలుస్తూ తిట్టిపోస్తున్నాకూడా కేసిఆర్ జగన్ బెయిల్ ను స్వాగతించాడు, అంతే కాదు ఆయనకు సీమాంద్రలో తిరుగులేని మెజారిటి వస్తుందని కూడా కితాబిచ్చాడు. అంటే జగన్ బెయిల్ తెలంగాణ విముక్తికి ఎక్కడో ముడిపడి ఉందనే కదా... మరి అదేంటి.

సోనియా విభజన నిర్ణయం తీసుకుని సీమాంద్రలో పార్టీని చంపేసింది, ఇక ఏంచేసినా కూడా సీమాంద్రలో గెలిచే అవకాశాలు లేవు అని అందరు అంటున్నమాటే కదా. ఇక తెలంగాణ ప్రకటించి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ ను బతికించుకుంది, ఇప్పడు విభజన నిర్ణయంపై వెనక్కుపోతే తెలంగాణలో కూడా పార్టీ చచ్చిపోతుందన్నది అందరు అనుకుంటున్న విషయమే కదా.. కాని ఆంద్రప్రదేశ్ మద్దతు లేకుండా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కూడా కల్లే అన్నదికూడా అందరికి తెలిసిందే.

అందుకే ఏపినుంచి టోటల్ మద్దతు కాంగ్రెస్ కేంద్రంలో కూడగట్టుకునేందుకు రాజకీయంగా ఎత్తులు వేస్తోంది అన్నది పచ్చినిజం. ఇప్పుడు సీమాంద్రలో మాత్రమే జగన్ హీరో అయ్యాడు, రాష్ట్రాన్ని విభజిస్తేనే జగన్ పవర్ ఫుల్ హీరో అవుతాడు, ఆయన ముఖ్యమంత్రి అవుతాడు, అలా కాక రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే జగన్ కూడా ఎటూ కాకుండా పోతాడు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇలా జరిగితే తెలంగాణలో టిఆర్ఎస్ మెజార్టీ కొట్టేస్తుంది, రాష్ట్రాన్ని విభజిస్తానని చెప్పి మోసం చేసినందుకు కాంగ్రెస్ కు మద్దతు కూడా ఇవ్వదు.

అలాగే రాష్ట్రాన్ని విడగొడతానని చెబితే తెలంగాణలో పార్టీని భూస్తాపితం చేసుకుని సీమాంద్రవైపు కు టర్న్ తీసుకుంటే అలా చేయకుండా హ్యాండిచ్చినందుకు జగన్ కూడా కాంగ్రెస్ కు హ్యాండిస్తాడు. పైగా జగన్, కేసిఆర్ లు కలిసి ఆంద్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితే నిండా మునిగేది కాంగ్రెస్సే. అందుకే జగన్ కు బెయిల్ వచ్చిందంటే కాంగ్రెస్ ఇక నూరుఆరైనా తెలంగాణ ఇచ్చేందుకే అన్నది క్లియర్ అయిందన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: