ఇంత వరకూ సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వస్టిగేషన్ కు ఆంధ్రప్రదేశ్ తో ఉన్న అనుబంధం అంతంత మాత్రమే. ఎందుకంటే ఏపీలో ఎప్పుడూ రాజకీయాను బంధం ఉండే కేసులతో సీబీఐ డీల్ చేయలేదు. అంత వరకూ జాతీయ స్థాయిలో రాజకీయనాయకుల ప్రమేయం ఉన్న కేసుల్లో విచారణ జరపడం గురించి సీబీఐ వ్యవహారం చర్చకు వచ్చేది. అదంతా అలా ఉంటే.. జగన్ కేసుతో సీబీఐ పేరు రాష్ట్రంలో మార్మోగింది. సీబీఐ జేడీలు ఫేమస్ అయ్యారు. వారికి అభిమాన సంఘాలు ఏర్పడ్డాయి. వ్యతిరేకించే వారూ కనిపించారు. 

 ఈ నేపథ్యంలో సీబీఐ క్యారెక్టర్ గురించి రెండు రకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీబీఐకు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వస్టిగేషన్ అంటూ నిర్వచనం ఇచ్చారు. ఈ కేసు విషయంలో సీబీఐ శీలాన్ని శంకించిన వారెంతో మంది. ఈ కేసు విషయంలో విభిన్నమైన అభిప్రాయాలతో ఉన్న వారు కూడా అంతిమంగా సీబీఐనే తప్పుపడుతున్నారు.

 జగన్ కు బెయిల్ రావడం సీబీఐ ఫెయిల్యూర్ అని అంటున్నారు తెలుగుదేశం నేతలు. జగన్ కాంగ్రెస్ అధిష్టానం మధ్య జరిగిన కుమ్మక్కుతో సీబీఐ జగన్ కు బెయిలొచ్చే అనుకూల పరిస్థితులు కల్పించిందనేది వీరి ఆరోపణ. జగన్ కు బెయిలొచ్చాకా.. తెలుగుదేశం సీబీఐ తీరును గురించి సందేహాలు వ్యక్తం చేస్తుండగా.. జగన్ పై కేసు పెట్టినప్పటి నుంచి జగన్ పార్టీ వాళ్లు సీబీఐ తీరు పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ తీరును తప్పు పడుతున్నారు. ఓవరాల్ గా ఈ కేసులో అటు రెండు వర్గాల విశ్వాసాన్ని పొందలేకపోయింది సెంట్రల్్ బ్యూరో ఆఫ్ ఇన్వస్టిగేషన్!

మరింత సమాచారం తెలుసుకోండి: