తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు పరోక్షంగా జగన్ కు బెయిల్ వచ్చేలా చేశాయా? అక్కడ చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయి కూటమి అంటూ చేసిన ప్రయత్నాలు ఆయన ప్రత్యర్థికి విముక్తి కలిగేలా చేశాయా? అంటూ జాతీయ స్థాయి విశ్లేషకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి వివిద పక్షాల నేతలను కలిశాడు. జగన్ కేసులో సీబీఐ విచారణ మందగమనంలో సాగుతోందని బాబు వారికి చెప్పుకొచ్చారు. అయితే వారి చేత జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడించలేకపోయారు. అయితే బాబు మూడో కూటమి గురించి ప్రయత్నాలు కొనసాగిస్తామని అనడం, ఎన్డీయే కూటమితో అభివృద్ధి సాధించామని చెప్పడం జరిగింది. ఈ మాటలతో కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయ్యిందని అంటున్నారు. ఏపీలో జగన్ ను జైల్లో పెట్టి బాబుకు అనుకూలమైన పరిస్థితులు కల్పించడం వల్ల తమకు వ్యక్తిగతంగా వచ్చే ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ అధిష్టానం భావించింది అంటున్నారు.

బాబు కు సీట్లు రావడం వల్ల తమకు ఏ మాత్రం ఉపయోగం ఉండదన్న లెక్కలేసుకున్న అధిష్టానం అ సీట్ల మీదకు జగన్ ను ఉసి గొల్పడమే మంచిదన్న లెక్కలేసిందంటున్నారు. ఈ నేపథ్యంలో.. జగన్ బెయిల్ విషయంలో ఈ సారికి కాంగ్రెస్ అధిష్టానం పట్టు విడిచిందని జాతీయ స్థాయి రాజకీయ విశ్లేషకుల అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: