ఎట్టకేలకూ జగన్ కు బెయిలొచ్చింది. 16 నెలల సుధీర్ఘ విరామానంతరం ఆయన బయటకు వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో జగన్ అనే వ్యక్తి జనం మధ్య లేకపోవడంతో ఆయనంటూ భౌతికంగా ఒకరున్నారన్న విషయంపై సంధిగ్దత ఏర్పడింది. అనుదినం కార్టూన్ల రూపంలోనూ, పాత వీడియోల రూపంలోనూ, వార్తల్లో జగన్ కనిపిస్తునే ఉన్నా.. జనం మధ్య లేకపోవడం దాదాపు జగన్ ను మరిచిపోయే పరిస్థితి ఏర్పడింది.

దీనికి బ్రేక్ నిస్తూ జగన్ కు బెయిలొచ్చింది. మరి ఇప్పుడు ఆయన ఏం చేయబోతాడు? అనేది ఆసక్తికరంగా మారింది. తిరిగి ఓదార్పు యాత్రను చేపడతాడా? లేక కొత్త రూట్ ను ఎంచుకుంటాడా? అనే విషయం తెలుసుకోవడానికి వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే జగన్ మోహన్ రెడ్డి బెయిల్ కు షరతులున్నాయి. ఆయన హైదరాబాద్ ను దాటి వెళ్లడానికి కోర్టు అనుమతి అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని జగన్ ఇంకా కోర్టుతో తేల్చుకోవాల్సి ఉంది. సొంత నియోజకవర్గానికి వెళ్లాలనో లేక ఇడుపుల పాయకు వెళ్లాలనో.. జగన్ కోర్టును కోరే అవకాశం ఉంది. రాజకీయ కారణాలు చెప్పి హైదరాబాద్ దాటేందుకు అవకాశం ఇవ్వమని అడగడానికి అవకాశం ఉంది.

అది జరిగితే.. జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు ఊపు మీదున్న సమైక్యవాదం మీద పడే అవకాశాలున్నాయి. ప్రజల్లోని సమైక్య కాంక్షను క్యాష్ చేసుకోవడానికి అవకాశముంది. ఇప్పటికే సమైక్యవాదం తమ నినాదం అని చెప్పుకొంది జగన్ పార్టీ. కాబట్టి జగన్ దాన్ని అస్త్రంగా చేసుకోవడానికి అవకాశముంది. ప్రస్తుతానికి జగన్ కు అంతకుమించిన ఛాయిస్ కూడా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: