దాదాపు 16 నెలల నుంచి జగన్ జైల్లో ఉన్నాడు. అంతకు ముందు స్వర్గసుఖాలను చూసిన జీవితం అతడిది. తండ్రి ముఖ్యమంత్రి అయ్యాకా.. జగన్ కు హై సర్కిల్ లో ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. సినిమా వాళ్లు, రాజకీయ నాయకులు అందరూ అతడి చుట్టూ మూగారు. ఇవన్నీ బయటకు కనిపించని దృశ్యాలే.. అయితే సినిమా వాళ్లతో జగన్ కు ఉన్న అనుబంధం గురించి ఇప్పటికే జనాలకు ఒక అవగాహనం వచ్చింది. చుట్టూ ఉన్న జనాలు ఈ స్టేటస్ వారైతే.. ఆయన ఇళ్లు ఇంద్రభవనం.. అసాధారణసౌకర్యాలు.

ఇలాంటి సౌకర్యాల మధ్య నుంచి జగన్ జైలుకువెళ్లాడు. జైలు కెళ్లే ముందు ఓదార్పు యాత్ర అంటూ.. ఊర్లు పట్టుకు తిరగడంలో జగన్ కు ఈ సుఖాలన్నీ దూరమే అయ్యుండవచ్చు. అయితే.. జైలు జీవితానికి ఆయన అంతకు ముందు అనుభవించిన జీవితానికి చాలా తేడా అయితే ఉంది. మరి ఇప్పుడు జగన్ ఆ జీవితం గురించి జనం మధ్య, తన వాళ్ల మధ్య ఎలా రియాక్ట్ అవుతాడు? అనేది ఆసక్తికరమైన అంశం.

జగన్ అయితే జైలు జీవితాన్ని కోరు కోలేదు. అక్కడ నుంచి  బయటపడటానికి శతధా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాల్లో తనకు నిరాశ ఎదురైన సందర్భాల్లో జగన్ ఎలా రియాక్ట్ అయ్యాడో, తనలో తానుఎలా బాధపడ్డాడో, ఎలా సమాధాన పరుచుకున్నాడో.. వంటి అంశాలు ఆసక్తికరమైనవి. వీటి గురించి జగన్ అసలు బయటకు చెబుతాడా? చెప్పడా? అనేది ఇంకా ఆసక్తికరమైనది. మరి జైలు అనుభవాల గురించి జగన్ వెర్షన్ ఏమిటో!

మరింత సమాచారం తెలుసుకోండి: