ప్రత్యేకం పక్కదారి పడుతోంది.ఇది పక్కా వ్యూహమా...నిజంగా వారి వారి ప్రాంతాల ప్రయోజనం కోసమా అన్నది పక్కన బెడితే ఈవ్యవహారం మాత్రం దారి తప్పుతోందని తెలుస్తోంది.          ప్రత్యేక తెలంగాణ అన్నది ముందు నుంచి ఉన్నదే. అలాగే ప్రత్యేక ఆంధ్ర అన్నది కూడా ముందు నుంచి ఉన్నదే. ఇప్పుడు ప్రత్యేక రాయలసీమ అంటూ బైరెడ్డి చేస్తున్న కొత్త లొల్లితో రాష్ట్రంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ వ్యవహారం ఇక ఏదో ఒక ధశకు వచ్చింది.అన్ని పార్టీలు కూడా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. ఈసంధర్బంలో ఈ వ్యవహారాన్ని నాన్చాలంటే సరికొత్త లొల్లిని తెరపైకి తేవాలని కాంగ్రేస్ ఈసరికొత్త వ్యూహాన్ని రచించిందా అన్న విషయాన్ని పక్కన బెడితే ఎవరికి వారు ఆత్మగౌరవం పేరుతో వేరు కుంపట్లు పెడుతుంటే రాయలసీమవారు ఈవిధంగా స్పందించడం సబబే.              అయితే ప్రజలనుంచి పుడితే దీనిని ఆహ్వనిస్తారు. ఇది ఏవిధంగా చూసినా సాద్యం కానిది. కాని బైరెడ్డి కి రాయలసీమలో స్పందన కనిపించింది.దీంతో ఇది మెల్లమెల్లగా రాజుకుంటుంది అన్న సంకేతాలు వెలుబడ్దాయి. అయితే ప్రజల ప్రయోజనాలకోసమే అయితే ఆహ్వానించవచ్చు. కాని ఇప్పుడు నడుస్తున్న తెలంగాణ.దీంతో లేచిన ప్రత్యేకాంధ్ర,ఇప్పుడు రాయలసీమ వెనుక రాజకీయప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ పేరుతో రాజకీయాల్లో హీరో అయి టీఆర్ఎస్ ను బలోపేతం చేసుకున్నారు కేసిఆర్. ఇదే సెంటిమెంట్ తో అటు ఆంద్రా,ఇటు రాయలసీమల్లో కూడా ఎవరికి వారే ఇలాంటి ప్రయోజనాలు పొందాలన్న స్వార్థమే కనిపిస్థోంది.                     అయినా ప్రజలకోసం,ప్రాంతాలకోసం తాపత్రయపడుతున్న వీరంతా రాజకీయాల్లో ఎప్పటినుంచో ఉన్నారు. ఇప్పుడు ప్రాంతీయ అభిమానం కట్టలు తెచ్చుకుంటోంది అంటే నమ్మే జనం మాత్రం ఎవరు లేరన్న నిజాన్ని గ్రహించే రోజులు మాత్రం వస్తాయన్నది నిజం.ఎందుకంటే వారిసొంత నియోజకవర్గాల్లో వారు ఏమిచేయకుండా ఏకంగా ప్రాంతంపై అభిమానాన్ని ఒలకబోయడం వెనుక ఏమున్నదన్నదన్నది ఎవరికి తెలియంది కాదు. మొత్తం మీద ప్రత్యేకం అన్నది పక్కదారి పడుతోందన్నది సుస్పష్టం. 

మరింత సమాచారం తెలుసుకోండి: