హైదరాబాద్: పోలీసుల వేధింపులు తట్టుకోలేక రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు కారకులైన సీఐ, ఎస్ఐ పై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్లితే...పరిగి మండలంలోని నస్కల్ గ్రామానికి చెందిన రాజు అనే ఓ వ్యక్తిని దొంగతనం కేసులో పరిగి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. గత మూడ్రోజులుగా పోలీసులు రాజును తీవ్ర చిత్రహింసలకు గురిచేస్తున్నారు. దొంగతనం కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం నస్కల్ వచ్చిన సందర్భంలో రాజు భార్యను కూడా విచారించారు. ఈ సందర్భంగా రాజు భార్యపట్ల పోలీసులు కొంత దురుసుగా ప్రవర్తించారు. ఇంటి దగ్గర ఉన్న తమ పట్లనే పోలీసులు ఇంత దురుసుగా ప్రవర్తిస్తున్నారంటే స్టేషన్ లో ఉన్న తన భర్తను ఇంకా ఎంత చిత్రహింసలకు గురి చేస్తున్నారోననీ, మనస్తాపానికి గురైన రాజు భార్య తన ఇద్దరు పిల్లలతో కలిసి ఓ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డది. జరిగిన విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు పోలీస్ ల తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకు దిగారు. పోలీస్ వేధింపులతో ముగ్గరు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై రాష్ర్ట హెం మంత్రి సబితారెడ్డి స్పందించారు. బాధ్యులైన పోలీసులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలనీ ఆదేశించారు. దీనితో సీఐ, ఎస్ఐ పై పోలీస్ స్టేషన్లో రెండు సెక్షన్ల కింద రంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: