హైదరాబాద: ఎట్టకేలకు ఫార్మసీ, ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించి మరికొన్ని గంటల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఒకటి నుంచి 15వేల ర్యాంకు వరకు రాష్ర్టంలోని 53కేంద్రాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు సంబంధిత అధికారులు అన్ని ఏర్పాట్లను చేశారు. కౌన్సెలింగ్ కేంద్రాల వద్ద విద్యార్థులకు కావల్సిన అన్ని ఏర్పాట్లను చేశారు. కౌన్సెలింగ్కు హాజరయ్యే విద్యార్థులు టెన్త్, ఇంటర్, ఎంసెట్ మార్కుల మెమోతొ పాటు స్థానిక కులధ్రువపత్రం, ఆదాయ, కు ధ్రువీకరణ పత్రాలతో కౌన్సెలింగ్ కేంద్రాల వద్దకు కేటాయించిన నిర్ణీత సమయంలో హాజరు కావల్సి ఉంటుంది. వచ్చే నెల మొదటి వారం వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. ఈ నెల 30లోపు విద్యార్థులు ఎంసెట్ వెబ్ సైట్ ద్వారా ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చు.   దీనితో ఈ నెల 29లోపు విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించే ఫీజు రీయింబర్స్ మెంటుపై ఓ నిర్ణయం తీసుకోనున్నది. ఇప్పటికే ఏ కళాశాలలో ఎంత ఫీజు ఉండాలో కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజురీయింబర్స్ మెంటుగా ప్రభుత్వం 35వేలు ఇవ్వాలనీ సూచనప్రాయంగా నిర్ణయించింది. కానీ, అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. దీనికి సంబంధించి ఈ రోజు మంత్రివర్గ ఉపసంఘం, అధికారులు సమావేశం కానున్నారు. ఫీజు ఖరారైతే ఇదే రోజులు ఉత్తర్వులు రావచ్చు. వచ్చే నెల మూడో వారంలో తరగతులు ప్రారంభమవుతాయి. కౌన్సెలింగ్ సందర్భంగా అధికారులు విద్యార్థులకిచ్చే పాస్ వర్డును ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు చూపెట్టకుండా జాగ్రత్తగా ఉండాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: