కరువు కరళ నృత్యం చేయడంతో పాటు కరంటు కోత కారణంగా రైతులు అప్పుల పాలై జీవితాలను చాలిస్తున్నారు. రోజుకో రైతు చొప్పున రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. ఇప్పటికి ఎంతో మంది రైతులు అప్పులపాలై చేసేది లేక ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సిరిసిల్ల ఉరిసిల్లగా మారి ఎంతో మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా మరో వైపు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో రైతులు చేసిన అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం నాలుగు రోజుల్లోనే కరంటుకోత, అప్పుల బాధతో ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే రైతులు వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పటికిని ప్రభుత్వం ఆత్మహత్యల నివారణ కోసం చర్యలు తీసుకోవడం లేదు. కరంటు కోత కారణంతో పాటు బోర్లు వేసి అప్పుల పాలైనటువంటి రైతంగానికి ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టమైనటువంటి హామినివ్వాల్సి ఉంది. గత నాలుగైదు సంవత్సరాలుగా ఏర్పడిన కరువు పరిస్థితుల సందర్భంగా రైతులు భూగర్భజలాల కోసం ఒక్కో రైతు నాలుగైదు బోర్లు వేశారు. అయినప్పటికిని నీరు రాకపోవడంతో అప్పుల పాలయ్యారు. కొంత మంది అప్పుల్లో కురుకుపోయి తీర్చే మార్గం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం స్పందించి రైతులు అప్పుల నుండి గట్టెక్కే మార్గం కోసం చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: