తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా బషీర్ బాగ్ వద్ద జరిగిన పోలీస్ కాల్పులకు 12 ఏళ్లు. విద్యుత్ చార్జీలను తగ్గించాలని వామపక్షాల అసెంబ్లీ ముట్టడించే ప్రయత్నాన్ని అడ్డుకోవడంలో జరిగిన ఉద్రిక్తత పరిస్థితుల్లో బషీర్ బాగ్ వద్ద పోలీసులు జరిపిన కాల్పుల్లో అమాయకులు చనిపోయారు. దీంతో తెలుగుదేశం ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. రైతు వ్యతిరేక ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ నిందలు మోసింది. ఆగస్టు 28, 2000 సంవత్సరంలో విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ తో ఉద్యమించాల్సిన పరిస్థితి రాకుండా చార్జీలు ఆ నాటి తెలుగుదేశం ప్రభుత్వం పెంచకుండా ఉండి ఉంటే తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి చవిచూసేది కాదని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రైతు వ్యతిరేక పార్టీగా ముద్రపడిన తెలుగుదేశం పార్టీని బషీర్ బాగ్ కాల్పలు ఇప్పటికి వెంటాడుతూనే ఉన్నాయి. రైతుల గూర్చి టిడిపి నాయకులు మాట్లాడిన ప్రతిసారి ఇతర పార్టీల నాయకులు బషీర్ బాగ్ కాల్పులను గుర్తు చేస్తూ విమర్శిలకు దిగుతున్నారు. కాగా ఆలస్యంగా నైనా ఆత్మవిమర్శ చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ రైతుల కోసం పోరాటం చేసేందుకు ముందుకు వస్తుంది. అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కరంటు కోతకు నిరసగా ఉద్యమించడంతో పాటు అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకున్న రైతుకుటుంబాలను పరామర్శించి తోచిన విధంగా ఆర్థిక సహయం చేయడం జరుగుతుంది. అదే విధంగా ఎండిపోయిన పంటలను పరిశీలించి, రైతులకు మనోదైర్యాన్ని ఇస్తుంది. బషీర్ బాగ్ కాల్పులు జరిగి 12 సంవత్సరాలు కావస్తుండడంతో విద్యుత్ ఉద్యమంలో చనిపోయిన వారికి నివాళులు అర్పించించడంతో పాటు ఈ సందర్భంగా నేడు విద్యుత్ సబ్ స్టేషన్ల ఎదుట ఆందోళన చేయడం కోసం సిపిఎం సిద్దమైంది. కాగా ప్రతి సంవత్సరం వామపక్ష పార్టీలు బషీర్ బాగ్ పోలీస్ కాల్పుల్లో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూ కాల్పుల్లో చనిపోయిన అమరులను గుర్తు చేసుకుంటుండగా తెలుగుదేశం పార్టీకి మాత్రం బషీర్ బాగ్ సంఘటన మానని గాయం మాదిరిగా తయారైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: